తన కొడుక్కు రష్యన్ స్టైల్లో నామకరణం చేసిన పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ కొడుకు పేరుపై రాంగోపాల్ వర్మ స్పందన పవన్ కొడుకు పేరుపై వర్మ చేసిన కమెంట్స్ పై వర్మ కూతురు రేవతి ఆగ్రహం జీరో సెన్స్ తో పోస్ట్ పెట్టావంటూ వర్మను నిలదీసిన పవన్ కల్యాణ్ అభిమాని రేవతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కుమారుడికి మార్క్ శంకర్ పవనొవిచ్ అనే పేరు పెట్టారు. దీనిపైనా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో స్పందించాడు. అసలు ఇంత గొప్ప పేరు భూమ్మీద భాష పుట్టిన నాటి నుంచి కూడా వినలేదన్నాడు. చరిత్రలో చెప్పబడినట్లు క్రీస్తుపూర్వం మధ్యయుగం నాటి 26వ ఈజిప్టు చక్రవర్తి కాలంలో నాటి సమెటికస్ చక్రవర్తి భాష పుట్టుకపై చేపట్టిన తొలి ప్రయోగం నుంచీ ఇప్పటిదాకా విన్న అతి గొప్ప పేరు ఇదేనని వర్మ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

పవన్ కల్యాణ్ కొడుకు పేరైన మార్క్ శంకర్ పవనొవిచ్ తనకెంతో నచ్చిందన్నాడు వర్మ. అయితే ఈ పేరు చూస్తే.. పవనిజం అనే భావజాలం విచ్ఛిన్నమవుతున్నట్లుగా అనిపిస్తోందని, అది(పవనిజం) రష్యన్ ఓవిచ్ గా మారుతోందని తనకు అనిపిస్తోందని అన్నాడు వర్మ. ఇక తన అన్న శంకర్(చిరంజీవి) కు ఇచ్చిన మర్యాదగా పవన్ కొడుకు పేరు కనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డాడు.

ఇక వర్మ కమెంట్ పై ఆయన కూతురు రేవతి వర్మ ఘాటుగా స్పందించారు. స్వయంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన రేవతి వర్మ స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వర్మ తిరిగి స్పందిస్తూ మరో ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ కొడుకు పేరుపై వర్మ చేసిన పోస్ట్ చాలా వికారంగా వుందని వర్మ కూతురు రేవతి అన్నారు. ఏదో నాలుగు అర్థం కాని పదాలు పెట్టి, పైగా సంబంధం లేని చరిత్రను రిఫరెన్స్ గా జోడించి.. అదేదో పెద్ద చారిత్రక ఆధారమంటూ.. తికమక పెట్టేలా అర్థంలేని పోస్ట్ పెట్టారని రేవతి అభిప్రాయ పడింది.

అయితే తన కూతురు రేవతి స్పందనపై వర్మ తిరిగి స్పందించారు. తన కూతురిగా కంటే పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఎక్కువగా వుండే రేవతి.. జీరో సెన్స్ అంటూ తనపై చేసిన కమెంట్స్ కు వర్మ రిప్లై ఇచ్చాడు. “పవన్ కళ్యాణ్ తాత్వికత అంతా మిధ్య అని, తను నిజాన్ని దాచిపెట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా.. ఆ నిజాన్ని అర్థం చేసుకోలేని నువ్వు ఎంత అనాగరికురాలివని నీ మాటల్లోనే తెలుస్తోందని” తన కూతురు రేవతితో వర్మ అన్నారు. “తద్వారా పవన్ కళ్యాణ్ ను నీకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నానని., నేను ప్రేమించినంతగా పవన్ కళ్యాణ్ ను నువ్వు ప్రేమించట్లేదని నిరూపించడానికి అన్నట్లుంది తప్ప మరేం లేదని” వర్మ తన కూతురుకి రిప్లై ఇచ్చారు. ఇంతకీ వర్మకి పవన్ అంటే ప్రేమ వుందో ద్వేషం వుందో అర్థంకాకుండా వుంది ఈ రిప్లై. దటీజ్ వర్మ.