Asianet News TeluguAsianet News Telugu

Ramesh Babu Death:రమేష్‌బాబు హీరోగా సక్సెస్‌ కాలేకపోవడానికి కారణమిదేనా?.. మహేష్‌తో సినిమాల నిర్మాణం..

కృష్ణ డేరింగ్‌ స్టెప్‌తో తీసుకున్నవే. స్టయిలీష్‌ యాక్టింగ్‌, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ తనయుడు రమేష్‌బాబు సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆయన హీరోగా నటించిన ఒకటి రెండు చిత్రాలు తప్పితే పెద్దగా మరేది విజయం సాధించలేదు.

rameshbabu not success as hero this is the reason produced movie with maheshbabu
Author
Hyderabad, First Published Jan 8, 2022, 11:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఘట్టమనేని కృష్ణ.. సూపర్‌స్టార్‌గా.. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టింగ్‌ యాక్టర్‌గా నిలిచారు. ఆయన సినిమాల్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. సినిమా బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌లోకి మారే క్రమంలో అనే ప్రయోగాలు జరిగాయి. ఆ ప్రయోగాలన్నీ కృష్ణ డేరింగ్‌ స్టెప్‌తో తీసుకున్నవే. స్టయిలీష్‌ యాక్టింగ్‌, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ తనయుడు రమేష్‌బాబు సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆయన హీరోగా నటించిన ఒకటి రెండు చిత్రాలు తప్పితే పెద్దగా మరేది విజయం సాధించలేదు.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన `బజార్‌ రౌడీ` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు రమేష్‌బాబు. అలాగే తండ్రితో కలిసి నటించిన `ముగ్గురు కొడుకులు` సినిమాతోనూ సక్సెస్‌ అందుకున్నారు. కానీ ఇది కృష్ణ క్రెడిట్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత రమేష్‌బాబు నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. అంతేకాదు `సామ్రాట్‌`, `కృష్నగారి అబ్బాయి` చిత్రాల్లో డబుల్‌ రోల్‌ చేశారు. కానీ ప్రయోజనం లేదు. హీరోగా సక్సెస్‌కాలేకపోయారు రమేష్‌బాబు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరగా ఆయన `ఎన్‌కౌంటర్‌` చిత్రంలో కీ రోల్‌ చేశారు. 

హీరోగా సక్సెస్‌ కాలేకపోవడంతో నిర్మాణంపై ఫోకస్‌ చేశాడు రమేష్‌బాబు. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై లి. బ్యానర్‌ని స్థాపించి సినిమాలు నిర్మించారు రమేష్‌బాబు. మహేష్‌తోనూ వరుసగా సినిమాలు చేశారు. మహేష్‌బాబు హీరోగా `అర్జున్‌` చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. అంతకు ముందు రమేష్‌బాబు 1999లో ఈవీవీ హిందీ `సూర్యవంశం` చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. `అర్జున్‌` సక్సెస్‌ సాధించినా.. నిర్మాణంలో జోరు పెంచలేకపోయారు రమేష్‌బాబు. 

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత మహేష్‌తో `అతిథి` చిత్రాన్ని నిర్మించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పరాజయం చెందింది. ఆ తర్వాత మహేష్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ `దూకుడు`, `ఆగడు` చిత్రాలకు ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఇందులో `దూకుడు` సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే.  నిర్మాతగానూ యాక్టివ్‌గా సినిమాలు నిర్మించడంలో విఫలమయ్యాడు రమేష్‌బాబు. దీంతో పూర్తిగా సినీ రంగానికే దూరమయ్యాడు. 

అయితే ఆయన సినిమాల్లో సక్సెస్‌ కాలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన చెడు అలవాట్లకి బానిస కావడమే కారణమనే వార్తలు వచ్చాయి. కృష్ణ వంటి సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కారణంగా తనకు సినిమాలు వస్తాయని భావించిన ఆయన నటనపై, కెరీర్‌పై పెద్దగా దృష్టిపెట్టలేదని, చెడు అలవాట్లకి బానిస కావడం వల్ల తన బాడీ ఫిట్‌నెస్‌ని కోల్పోవడం,నటుడిగా ఆయన్ని చూడలేని పరిస్థితి మారిపోవడం, పైగా సినిమాలపై ఆయనకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు. గత కొంత కాలంగా ఆయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట.  కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్‌ తీవ్ర సంతాపాన్ని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios