పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన చిరంజీవి మెగాస్టార్ పుట్టిన ఊరి పేరుతో సినిమా టైటిల్ పెట్టాలని చరణ్ ప్లాన్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్, సుకుమార్ మూవీ

రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ ముందు సక్సెస్ సాధించిన ధృవ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుంది. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ హీరో రోల్స్ లో కనిపించిన చరణ్ ఈ సినిమాతో వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడిగా వెరైటీ కేరక్టర్ లో కనిపించనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు టైటిల్ విషయంలో కూడా వేట కొనసాగుతోంది. చరణ్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆ హైప్ కంటిన్యూ చేసే స్థాయి టైటిల్ ను నిర్ణయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పూర్తిగా పల్లె వాతావరణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రేపల్లె, పల్లెటూరి మొనగాడు, మొగల్తూరు చిన్నోడు అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన థీమ్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో త్వరలోనే టైటిల్ లోగో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ టీమ్.