శ్రీరెడ్డి వివాదం చవకబారుగా మారిపోయిందని రామ్ చరణ్ ఆవేదన

First Published 18, Apr 2018, 5:45 PM IST
Ramcharan says srireddy controversy raked up for media attention
Highlights

శ్రీరెడ్డి వివాదం చవకబారుగా మారిపోయిందని రామ్ చరణ్ ఆవేదన

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో గత రెండు రోజులుకు టాలీవుడ్ మొత్తం కోపంతో ఊగిపోతోంది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్ తో పాటు  మీడియా మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు పవన్ కు రాంచరణ్ మద్దతు కూడా లభించింది. ఆయన తన ఫేస్ బుక్ ఇలా స్పందించారు.."అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. ఇక్కడ మహిళలను అత్యంత గౌరవంగా చూస్తారు. ఏమైన సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది." అంటూ సోషల్ మీడియాలో తన మటలను తెలిపారు.

loader