ఎన్టీఆర్ జైలవకుశ సినిమా చూసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించాడన్న రణ్ షో అయ్యాక సంయుక్తంగా ‘విక్టరీ’ సింబల్ చూపించిన తారక్, చెర్రీ

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనను, మరీ ముఖ్యంగా ‘జై’ పాత్రను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా వీక్షించాడు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో అదరగొట్టేశావంటూ జూనియర్ ఎన్టీఆర్ కు రామ్ చరణ్ కితాబునిచ్చాడు. ‘జై’ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తారక్ ను చెర్రీ అభినందించాడు. 

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆప్యాయంగా కలిసి, ‘విక్టరీ’ సింబల్ చూపిస్తూ నిలబడి పోజిస్తున్న ఫొటోను ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కూడా ఉన్నారు. ‘‘జై లవ కుశ’ సినిమాను చూసిన అనంతరం, ‘జై’ తో రామ్ చరణ్ వేడుక...థ్యాంక్యూ’ అని కోన వెంకట్ పేర్కొన్నారు.