టాలీవుడ్ లో వన్నాఫ్ ది స్టయిలిష్ జంట రామ్ చరణ్ అండ్ ఉపాసన   రిషికేశ్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న  రామ్ చరణ్  ఉపాసన



అదిగో నిన్న ఇద్దరూ కూడా హిమాలయాల్లో ఉన్న రిషికేశ్ లో సేద తీరుతూ కనిపించారు. అక్కడ పరమార్ధ్ ఆశ్రమంలో ఉపాసన ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.. మన మైండులో ఆలోచనలు సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది అనే అంశంపై ఉప్సీ అక్కడ ఒక సెమినార్ నిర్వహించింది. ఆమెను ప్రోత్సహించడానికి రామ్ చరణ్ కూడా వెళ్లాడట. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇద్దరూ అక్కడే ఒక ఉద్యానవనంలో అలా సేద తీరుతూ తమ ప్రేమకథలో ఒక మాంచి రొమాంటిక్ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నారు కదూ. అయితే సుకుమార్ సినిమా చేయాల్సిన చరణ్ ఇలా రిషికేశ్ లో టైమ్ స్పెండ్ చేస్తుంటే.. ఇంక సినిమా ఎప్పుడు మొదలెడతాడూ.. ఎప్పుడు రిలీజవుతుంది.ఆ తరువాత మరో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? చరణ్ కే తెలియాలి.