నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న రామాయణం సినిమా ఫస్ట్ లుక్ ప్రోమో విడుదలైంది.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో విడుదలయ్యాయి. ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణ్‌బీర్ రాముడిలా కనిపిస్తున్నాడు. ఆయన లుక్ చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక విల్లుతో యోధుడిలా కనిపిస్తున్న రణ్ బీర్ కపూర్ వెనకాల అడవి, సూర్యుడు, మేఘాలతో అద్భుతంగా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు.
రణ్‌బీర్‌తో పాటు యష్ కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో యష్ రావణాసురుడు గా నటిస్తున్నాడు. వీడియోలో రాముడు, రావణుడి మధ్య యుద్ధం చూపించారు. రణ్‌బీర్, యష్ లుక్స్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో రామాయణం టీజర్ , ఫస్ట్ లుక్ ను వైరల్ చేస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సినిమాను వచ్చే ఏడాది, అంటే 2026 దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. ఇక రామాయణంలో రెండో భాగం సినిమాను 2027 దీపావళికి విడుదల అవుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
ఇక ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల కోసం దాదాపు 850 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణంలో సీతగా సాయి పల్లవి నటిస్తోంది. హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మెర్, ఏ.ఆర్.రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో సినిమాపై అంచనాలు పెంచాయి.
రామాయణం సినిమాలో నటించడానికి నటులకు భారీగా పారితోషికం ఇచ్చారు. యష్‌కి 200 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విలన్ పాత్రకు పారితోషికం ఇవ్వడం ఇదే మొదటిసారి. సాయి పల్లవికి ఒక్కో భాగానికి 15 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం. ఇక రణ్ బీర్ కపూర్ కూడా ఈసినిమా కోసం 60 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
