Asianet News TeluguAsianet News Telugu

రామాయణ సీరియల్ నటుడు చంద్రశేఖర్ మృతి

ముంబై జుహూలోని పవన్ హాన్స్ స్మశానవాటిక నందు నేడు సాయంత్రం చంద్రశేఖర్ అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రామాయణ సీరియల్ నందు చంద్రశేఖర్ దశరథుడు మంత్రి అయిన ఆర్య సుమంత్ రోల్ చేశారు. 
 

ramayana actor chandrashekar dies at 98 ksr
Author
Hyderabad, First Published Jun 16, 2021, 2:36 PM IST

ఇండియాస్ పాప్యులర్ మైథలాజిక సీరియల్ రామాయణ నటుడు చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ వయసు 98ఏళ్లుగా తెలుస్తుంది. ఆయన నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు సమాచారం. వందేళ్ల ప్రయానికి దగ్గరైన చంద్రశేఖర్ కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని, ఆయన ఆరోగ్యకర జీవనం గడిపినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 


ముంబై జుహూలోని పవన్ హాన్స్ స్మశానవాటిక నందు నేడు సాయంత్రం చంద్రశేఖర్ అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రామాయణ సీరియల్ నందు చంద్రశేఖర్ దశరథుడు మంత్రి అయిన ఆర్య సుమంత్ రోల్ చేశారు. 


హైదరాబాద్ లో పుట్టిపెరిన చంద్రశేఖర్ 1950లలో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. సురంగ్, కవి, మస్తాన్, బసంత్ బాహర్, కాలీ తోపి లాల్ రుమాల్ వంటి చిత్రాలలో కీలక రోల్స్ చేశారు. 1964లో విడుదలైన ఛ ఛ ఛ  చిత్రం నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు చంద్రశేఖర్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios