Asianet News TeluguAsianet News Telugu

Ayodhya:అయోధ్య రాముడి కోసం మరోసారి ఒక్కటైన బుల్లితెర సీతారాములు.. మూడున్నర దశాబ్దాల తర్వాత ఒకే ఫ్రేములో..

అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట జరిగే అద్భుతం క్షణం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఆ అద్భుత కార్యం జరగబోతోంది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు.

Ramayan TV series actors unite for Ayodhya Ram temple dtr
Author
First Published Jan 19, 2024, 6:05 PM IST

అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట జరిగే అద్భుతం క్షణం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఆ అద్భుత కార్యం జరగబోతోంది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా సెలెబ్రిటీలు ఇప్పటికే విరాళాలు అందించారు. 

రామాయణం ఇతిహాసంపై ఇప్పటికే అనేక చిత్రాలు వెండితెరపై వచ్చాయి. అయితే బుల్లితెరపై రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం టివి సిరీస్ ని మించింది మరొకటి రాలేదు. 90వ దశకంలో బుల్లితెరపై రామాయణం ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. 

ఈ టివి సిరీస్ లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్,, సీతాదేవిగా దీపికా చికాలియా, లక్ష్మణుడిగా సునీల్ లెహ్రి నటించారు. ఈ టివి సిరీస్ ద్వారా వీరికి దక్కిన గౌరవం, గుర్తింపు అంతా ఇంతా కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ త్రయం అయోధ్య రాముడి కోసం మరోసారి ఒక్కటయ్యారు. 

 

అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ ముగ్గురూ ప్రత్యేక వీడియో సాంగ్ లో నటించారు. ఖుషి మ్యూజిక్ ఆల్బమ్ సంస్థ రూపిందించిన 'హమారే రామ్ ఆయే హై' అనే వీడియో సాంగ్ లో బుల్లితెర సీతా రాములు లక్ష్మణుడితో సహా నటించారు. ఈ వీడియో సాంగ్ జనవరి 22న రిలీజ్ కానుంది. 

దీనితో ఈ ముగ్గురిని రామాయణం టివి సిరీస్ లోని దృశ్యాలతో పోల్చుతూ ఆ ఫొటోలో వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు, అభిమానులు అర్జున్ గోవిల్, దీపికా, సునీల్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios