`ఆదిపురుష్` సినిమాపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా `రామాయణం`(2008)లో హనుమంతుడి పాత్రని పోషించిన నటుడు విక్రమ్ మస్తర్ `ఆదిపురుష్` సినిమాపై స్పందించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
`ఆదిపురుష్` సినిమా ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు, హిందుత్వ వాదులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. క్రిటిక్స్ నుంచి కూడా కొంత విమర్శ వచ్చింది. మరోవైపు సినిమా కలెక్షన్ల పరంగానూ మూడు రోజులు ఫర్వాలేదనిపించుకుంది. కానీ సోమవారం నుంచి డల్ అయ్యింది. ఆరవై శాతం కలెక్షన్లు పడిపోయాయి. జనరల్‌గా వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు తగ్గడం కామనే.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా `రామాయణం`(2008)లో హనుమంతుడి పాత్రని పోషించిన నటుడు విక్రమ్ మస్తర్ `ఆదిపురుష్` సినిమాపై స్పందించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమాలో వాడిన డైలాగులపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందూ మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో సంభాషణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆయన వెల్లడించారు.
`సినిమాలో వాడిని భాషను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినిమా మేకర్స్ ఉపయోగించిన భాషతో ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేమిటి? మీరు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారా? సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీసి, వారికి నచ్చకపోతే ఆయా సంభాషణలను ఎందుకు తొలగించడం లేదు? డైలాగ్‌లను తొలగించడానికి మీకు సమస్య ఏంటి? సినిమాలు తప్పు ఏమిటో ఎందుకు చూపించాలనుకుంటున్నారు?` అంటూ ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు `సినిమా ద్వారా హక్కుని వ్యక్తపరచండి,ఈ సినిమా కథ రామాయణం ఆధారంగా ఉంటుంది. సీతను, రాముడిని గౌరవిస్తా, పూజిస్తాం. అలాంటి దేవతలకు ఇలాంటి సంభాషణలు ఎలా సరిపోతాయ`ని నటుడు విక్రమ్ మస్తల్ మండిపడ్డారు. వెంటనే డైలాగులను తొలగించాలని తెలిపారు. రామాయణాన్ని ఇలా మార్చి సినిమా తీయడాన్ని ఆయన వ్యతిరేకించారు. అంతేకాదు దర్శక, నిర్మాతలు, రైటర్ కూడా తనకు నచ్చలేదని, వారిని తాను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు విక్రమ్ మస్తల్.
`భారతీయ సంస్కృతిని ప్రపంచం ఎలా గ్రహించాలని మీరు కోరుకుంటున్నారు? రామాయణంలో హనుమాజ్ జీ ఇలాగే ఉంటే మనం ఆలయానికి వెళ్లి పూజించేవారా? ఈ సినిమాని రూపొందించడంలో మీ లక్ష్యం అర్థిక ప్రయోజనమేనని స్పష్టమవుతుంది. నేను ఓరౌత్, రైటర్‌లను వ్యతిరేకిస్తున్నా` అని అన్నారు విక్రమ్ మస్తల్. ప్రభాస్ హీరోగా నటించిన `ఆదిపురుష్` సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవదత్త నటించారు. శుక్రవారం విడుదలైన సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
