పరువు హత్యల నేపథ్యం తెరకెక్కిన రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు". ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ తెలంగాణ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి గారిని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. రమణాచారి చిత్ర యూనిట్ ని ప్రశంసించి మాట్లాడారు. 

బంగారు బాలరాజు చిన్న సినిమా అయినప్పటికీ పబ్లిసిటి మాత్రం పెద్ద సినిమాల తరహాలో చేశారు. అందుకు కారణమైన పబ్లిసిటి ప్రొడ్యూసర్స్ కె.యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డిని అభినందిస్తూ.. గతంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేనప్పుడు “అనిత ఓ అనిత” వీడియో సాంగ్ ని కోటేoద్ర దుద్యాల సంచలనం చేశారని అన్నారు. 

అదే విధంగా సినిమా యొక్క టీజర్స్ చాలా బావున్నట్లు తెలుపుతూ త్వరలోనే వీలు చూసుకొని బంగారి బాలరాజు చిత్రాన్ని తప్పకుండా చూస్తానని రమణాచారి వివరించారు.దీంతో రమణాచారి మాటలకూ చిత్ర దర్శక నిర్మాతలు మరియు ప్రధాన నటీనటులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.