వార్నీ.. రామ్ కొత్త ఫొటో వెనుక ఇంత మ్యాటరుందా?

ఒక్కోసారి తాము చేయబోయే సినిమాల గురించి పొటోలతో హీరోలు క్లూలు ఇస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రామ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రామ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా ఉంది. రెగ్యులర్ కి భిన్నంగా ఆ లుక్ ఉంది. 

Ram would keep this look for Linguswamy movie? jsp

సినీ సెలబ్రెటీలు తమ ఫొటోలను ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. ముఖ్యంగా తమ లేటెస్ట్ లుక్ ని ఫ్యాన్స్ కు చూపెట్టడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. దాని వల్ల ఎప్పుడూ జనాల్లో ఉన్నట్లుంటుంది. అయితే ఒక్కోసారి తాము చేయబోయే సినిమాల గురించి ఈ లుక్ లతో క్లూలు సైతం ఇస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రామ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రామ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా ఉంది. రెగ్యులర్ కి భిన్నంగా ఆ లుక్ ఉంది. 

దాంతో ఈ కొత్త లుక్ తన నెక్ట్స్ సినిమాకోసం అంటున్నారు అభిమానులు. పొడవుపాటి జుట్టు, గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా ఉన్నాడు. లింగుస్వామితో తాను చేయబోయే సినిమాలో ఇదే లుక్ తో కనపడబోతున్నానని క్లూలు ఇస్తున్నాడని చెప్పుకుంటున్నారు. రెండు నెలల క్రితం లాంచ్ అయిన ఈ సినిమా సెకండ్ వేవ్ తో రెగ్యులర్ షూట్ కు బ్రేక్ పడింది. కృతి శెట్టి ఈ సినిమాలో నటిస్తోంది.
 
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుకి రామ్ కు సంక్రాంతి కానుకగా వచ్చిన రెడ్ బ్రేకులు వేసింది. ఎంతో అలోచించి రెడ్ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. డ్యూయెల్ రోల్ చేసినా పట్టించుకునే వాళ్లు కరువు అయ్యారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వచ్చిన ఓటిటి ఆఫర్స్ ని రామ్ అస్సలు లెక్క చెయ్యకుండా థియోటర్స్ లో విడుదల చేయటం కలిసి రాలేదు. ఈ నేపధ్యంలో రామ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆశక్తి నెలకొంది. ఇప్పుడు ఏ దర్శకుడితో, రామ్ ఎలాంటి సబ్జెక్టు చేస్తాడు..అంటే మాస్ సినిమా చేస్తాడా లేక లవర్ బాయ్ కాన్సెప్టుతో ముందుకు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నారు. 

ఈ క్రమంలో రామ్ - లింగు స్వామి కాంబో ఫిక్స్ అయ్యింది. సమంతతో యు టర్న్ సినిమా చేసిన నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించబోతున్నారు. మరి రామ్ - లింగు స్వామి బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది.. మాస్ లేదా లవ్ స్టోరీ నా అనేది ప్రస్తుతానికి వేచి చూడాలి. 

 లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్‌తో అతడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరో ప్రక్క రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. దాంతో రామ్ తన తదుపరి చిత్రంగా పక్కా మాస్ సబ్జెక్టుని ఎంచుకుంటారని తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios