Asianet News TeluguAsianet News Telugu

లాస్ట్ మినిట్ సర్పైజ్: ఏడు భాషల్లో ‘రెడ్’

ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం,మలయాళం,బెంగాలీ, భోజ్ పురి ,మరాఠీ,తమిళం తో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నాం. రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులనీ ఆకట్టుకుంటుంది.

Ram s Red to release in seven languages jsp
Author
Hyderabad, First Published Jan 7, 2021, 4:25 PM IST

ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో రామ్ థియేటర్లలోకి దూకటానికి రెడీ అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్  సినిమాని చేసాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంభందించిన మరో విశేషం ఏమిటంటే..ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ అవుతోంది.

  నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం,మలయాళం,బెంగాలీ, భోజ్ పురి ,మరాఠీ,తమిళం తో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నాం. రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులనీ ఆకట్టుకుంటుంది.

 అలాగే తెలుగు వెర్షన్ గ్రేట్ ఇండియాఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్ లో కూడా విడుదల చేస్తున్నాం. అమెరికా తో పాటు ఆస్ట్రేలియా,సింగపూర్,దుబాయి లలో రిలీజ్ చేస్తున్నాం. వసూళ్ల కోణంలో కాకుండా ప్రేక్షకులకు థియోటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశం తోనే ఆయా ఏరియాల పరిస్థితుల్ని బట్టి కొన్ని కొన్ని చోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఏది ఏమైనా ‘రెడ్’చిత్రం ఈ సంక్రాంతికి మంచి అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతున్నప్పటికి సినిమా కథ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు.. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత రామ్ మూవీ కావడం, మళ్ళీ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపధ్యంలో రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ మొదట అనుకున్నా..  ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని రామ్ పట్టుబట్టి ఆపాడట‌.  
 
 
న‌టీన‌టులు:
రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సంస్థ‌: శ‌్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.
రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ వచ్చింది.  

Follow Us:
Download App:
  • android
  • ios