Asianet News TeluguAsianet News Telugu

‘రెడ్‘ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘రెడ్’. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, అమృతా అయ్యార్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సినిమా ‘తడమ్’‏కు ఇది రీమేక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‎గా నిలిచింది. తాజాగా ఈ హిట్ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

Ram s Red Gets A Streaming Date jsp
Author
Hyderabad, First Published Feb 17, 2021, 6:22 PM IST

ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం... సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న  ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.గతేడాది ఏప్రిల్ 9న సమ్మర్‌లో విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి దాదాపు పది నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైంది.

 మధ్యలో ఈ సినిమాకు మంచి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా.. అన్నింటినీ కాదని ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేసారు. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ రావటంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే సినిమా బాగుందని చూసిన వారు అన్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది ఈ చిత్రం ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ..సన్ నెక్ట్స్, నెట్ ప్లిక్స్ లలో పిభ్రవరి 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమాలో హీరో రామ్ తన కెరీర్‌లో తొలి సారి ద్విపాత్రాభినయం చేసాడు. రామ్‌తో పాటు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు నటించారు.ఇస్మార్ట్ శంకర్ లాంటీ సినిమా తర్వాత రామ్ నుండి ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. వాటిని అందుకోలేకపోయింది.

 రామ్ ద్విపాత్రాభిన‌యం...  ఆయ‌న తొలిసారి ఓ థ్రిల్లర్‌ క‌థ‌లో న‌టించ‌డం.  - ఇలా ప‌లు ప్రత్యేకతలున్న సినిమా ఇది.  తమిళంలో విజ‌య‌వంత‌మైన ‘త‌డ‌మ్’కి రీమేక్‌గా తెర‌కెక్కింది.  మాతృక‌తో పోలిస్తే అద‌నంగా కుటుంబ నేప‌థ్యాన్ని, ప్రేమ‌కి సంబంధించిన అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు తిరుమ‌ల కిశోర్‌. 

రామ్ ఇదివర‌కు చేసిన చిత్రాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన అనుభూతినే  పంచుతుంది. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ త‌ర్వాత ఆ వైవిధ్యాన్ని కొన‌సాగించిన‌ట్టు అనిపిస్తుంది.  సినిమాకి రామ్ ద్విపాత్రాభిన‌య‌మే ప్రధాన ఆకర్షణ‌. తిరుమ‌ల కిశోర్ త‌న మార్క్ ర‌చ‌న‌తో థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా, అంద‌రికీ  న‌చ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దే ప్రయ‌త్నం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios