ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తర్వాత తనలోని మాస్ యాంగిల్ ను మరింత బయటికి లాగుతున్నాడు హీరో రామ్ పోతినేని. గతంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ Sukumar డైరెక్షన్ లో వచ్చిన ‘జగడం’ మూవీలో మాస్ రోల్ ను పోషించాడు. ఆ తర్వాత అన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్, రొమాంటిక్ ఫిల్మ్స్ తోనే ఫ్యాన్స్ ఖుషీ చేస్తూ వచ్చాడు. కానీ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ కాంబినేషనల్ లో వచ్చిన Ismart Shankar తో మాస్ విజువల్స్ ను చూపించాడు. మొన్నటి వరకూ ఇస్మార్ట్ శంకర్ మేనియానే కొనసాగింది. ఆ తర్వాత ‘రెడ్’ మూవీలోనూ మాస్ రోల్ కే ప్రయారిటీ ఇచ్చాడు రామ్. కానీ ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.
తాజాగా డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ‘ది వారియర్’ The Warrior మూవీతో మరోసారి మాస్ ట్రీట్ ను అందించేందుకు రెడీ అవుతున్నారు. ఫుల్ ఎనర్జితో.. మాస్ అటీట్యూడ్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్. అయితే, మేకర్స్ ది వారియర్ థియేటర్ రిపోర్టింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది జులై 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ తో పాటు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో చేతిలో గన్ పట్టుకున్న రామ్ పోతినేని చాలా ఆవేశంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ లో ఓ నిందితుడి కోసం ఎదురుచూస్తన్నట్టుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం గతేడాది జులై 13న షూటింగ్ ను ప్రారంభించుకోగా.. జులై 14న రిలీజ్ కానుంది. సరిగ్గా ఏడాదిలో సినిమాను రిలీజ్ చేయడం విశేషం. చాలా సినిమాలు కరోనా థర్డ్ వేవ్ కు ముందే ప్రారంభమై.. కరోనా పరిస్థితులను దాటుకుంటూ రిలీజ్ అయ్యే వరకు దాదాపు రెండేండ్ల సమయం పట్టింది. కానీ రామ్ కు ఆ చిక్కుల్లేకపోవడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లింగుస్వామి డైరెక్షన్ చేస్తున్న ‘ది వారియర్’లో రామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గ్లామర్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) రామ్ సరసన ఆడిపాడనుంది. ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) ప్రత్యర్థి పాత్రను పోషిస్తున్నారు. చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.
