ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.10.57 కోట్ల షేర్ రాబట్టింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

'స్కంద' ఐదు రోజుల లాంగ్ వీకెండ్, హాలీడే పీరియడ్ రన్ ముగించటంతోనే అసలైన స్టామినా ఏమిటో బయిటకు వచ్చింది. ఫైనల్ గా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో విఫలమైందని క్లారిటీ వచ్చింది. రామ్ కు వరస పెట్టి వస్తున్న డిజాస్టర్స్ లో మరొకటి చేరింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా కంటెంట్, డైలాగ్‌లు తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి. బోయపాటికి కావాలని రాయించారో హీరో రామ్‌కి ఏపీ గవర్నమెంట్‌పై ఉన్న కోపమో తెలియదు.. ఇన్ డైరెక్ట్‌గా ఏపీ గవర్నమెంట్‌ని బాగానే కెలికారు అని చెప్పాలి. 

 ‘బూం.. బూం బీర్లు’పై సెటైర్లు కానీ.. ‘నిద్రపోతున్నవాడ్ని చంపడం నీకు అలవాటేమో.. లేపి చంపడం నాకు అలవాటు’, ‘ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డం వస్తే లేపాలే.. ఇప్పుడు సీఎంలు అయినవాళ్లు ఇలా అయినవాళ్లే కదా’.. అని హీరో చెప్పే డైలాగ్‌లు ఇన్ డైరెక్ట్‌గా గట్టిగా తగిలాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీన్‌తో సంబంధం లేకుండా డైలాగులు వచ్చి పోయాయి. కానీ చిత్రంగా టీడీపీ మద్దతుదారులు ఈ చిత్రాన్ని కూడా పూర్తి స్దాయిలో ఈ సినిమాని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా రిజల్ట్‌తో రామ్ పోతినేని నిరాశకు లోనైనట్లు అర్దమవుతోంది. విడుదల తర్వాత ప్రమోట్ చేయడం మానేశాడు. నందమూరి బాలకృష్ణకు మాత్రమే బోయపాటి బెస్ట్ ఇవ్వగలరని మరోసారి ప్రూవైంది. బోయపాటి సినిమాలు ఇతర హీరోలకు పని చేయవు. బోయపాటి సినిమాల్లో ఉండే అతిశయోక్తి కథ,కథనం, లౌడ్ గా ఉండే థీమ్‌లు, ఇల్లాజికల్ సీక్వెన్సులు ఇతర స్టార్‌లకు వర్కవుట్ కావటం లేదు. అల్లు అర్జున్ ఒక్కడే అలా బయిటపడ్డాడు. 

 రామ్, బోయపాటి కాంబోలో వచ్చిన మొదటి సినిమా కావడం, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండటంతో.. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.10.57 కోట్ల షేర్ రాబట్టింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది. రూ.46.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన స్కంద.. భారీ నష్టాలనే మూట కట్టుకోబోతోందని సమాచారం. ఇప్పటిదాకా వసూలైన మొత్తం 26 కోట్లే. మరో ఇరవై వచ్చినప్పుడే బ్రేక్ ఈవెన్ అనిపించుకుంటుంది. కానీ ఆ పరిస్దితి లేదు. దాంతో ఇంకా రన్ క్లోజ్ కాలేదు కాబట్టి మరో ఐదు వచ్చినా పదిహేను కోట్లు దాకా నష్టం తప్పదు. ఇలాంటి పరిస్దితిల్లో ఓటిటి సంస్దతో ఎగ్రిమెంట్స్ రేట్లు తగ్గించి తిరిగి రాస్తూంటారు. అదే జరిగితే అటూ రికవరీ ఉండదు. ఈ విషయం బోయపాటికి అర్దమైంది. ఆయన ఎక్కడా ఇంటర్వూలలో కనిపించటం లేదు. రామ్ తన తదుపరి చిత్రం బిజిలో మునిగిపోయారు. శ్రీలీల మాత్రం చేసేదేముంది ఆమె తన నెక్ట్స్ ప్రాజెక్టులలో తలమునకలుగా ఉంది. 

ఏదైమైనా మాస్ లో బోయపాటి శ్రీను కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్, క్రేజ్ ఉంది. భద్ర నుంచి అఖండ వరకూ బొయపాటు తొమ్మది సినిమాలు తీస్తే.. అందులో ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్. ప్రారంభంలో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన ఘ‌న‌త బోయపాటిదే. అవి కూడా అలాంటి మామూలు హిట్స్ కాదు.. ఊర మాస్ చిత్రాలతో హిట్స్ . అయితే స్కంద సినిమాలోనూ అదే స్థాయి మాస్ ఫీస్ట్ అందించే ప్రయత్నం చేశారు బోయపాటి. అయితే ఇది మరో వినయవిథేయరామ అయ్యి కూర్చుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ.. మాస్ ఆడియన్స్‌తో వీరంగం చేస్తున్నాను అనుకున్నాడు కానీ మరీ బోర్డర్ దాటేసి బొమికలు లెక్కెట్టేస్తున్నాను అనుకోలేదు . కమర్షియల్ కిటుకులు బాగా తెలిసిన బోయపాటి.. మాస్ ఆడియన్స్‌కి గాలం వేయడంలో తడబడ్డాడు. దాంతో స్కందలో కేవలం ఊచకోత మాత్రమే కనిపించింది.. ఆయన్ని ఇష్టపడే మాస్ ఆడియన్సే వామ్మో అనేట్టు చేశారు. దాంతో రిజల్ట్ తేడా కొట్టింది.