Skanda Collections: స్కంద కలెక్షన్స్... రెండో రోజుకే భారీ డ్రాప్, టార్గెట్ ఎక్కడో!
భారీ అంచనాల మధ్య విడుదలైన స్కంద బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది. ఫస్ట్ డే పర్వాలేదు అనిపించిన స్కంద వసూళ్లు రెండో రోజు సగానికి పైగా పడిపోయాయి.

దర్శకుడు బోయపాటి-రామ్ పోతినేనిల పాన్ ఇండియా చిత్రం స్కంద. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కింది. స్కంద చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్ డే స్కంద పర్లేదు అనిపించింది. మొదటిరోజు ఏపీ/తెలంగాణాలలో స్కంద రూ. 8.52 కోట్ల షేర్ రాబట్టింది. సెకండ్ డే స్కంద వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయాయి. స్కంద రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల షేర్ రాబట్టగలిగింది. నైజాంలో 1.52 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. ఏపీలో వసూళ్లు మరింత క్షీణించాయి.
రెండు రోజులకు ఏపీ/తెలంగాణా కలిపి రూ. 12.12 కోట్ల షేర్, రూ. 19.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ.1.25 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ స్కంద టూ డేస్ కలెక్షన్స్ చూస్తే... రూ.14.57 కోట్ల షేర్, రూ. 24.30 కోట్ల గ్రాస్ రాబట్టింది.
స్కంద వరల్డ్ వైడ్ రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రూ. 47 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. మిరాకిల్ జరిగితే కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే వీకెండ్ తో పాటు గాంధీ జయంతి కలిసొచ్చే అంశాలు. బాక్సాఫీస్ వద్ద మూవీ పుంజుకుని జోరు చూపించాలి. లేదంటే భారీ నష్టాలు మిగల్చడం ఖాయం....
స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. సాంగ్స్, బీజీఎం విషయంలో థమన్ ఫెయిల్ అయ్యాడన్న మాట వినిపిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.