Asianet News TeluguAsianet News Telugu

షాక్: బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదా? ఆ రేటుకి ఇస్తేనే తీసుకుంటారా?

 ట్రైలర్ చూస్తూంటే హీరో రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాడు బోయ‌పాటి అని అర్దమవుతోంది. ఆడియన్స్  అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటుంద‌ని అర్థం అవుతోంది. 

Ram Pothineni Skanda theatrical business is not closed yet  jsp
Author
First Published Sep 21, 2023, 7:44 AM IST


ఉస్తాద్ రామ్ పోతినేని ఒక్కసారిగా గేరు మార్చారు. యాక్షన్ సినిమాలని నమ్ముకుంటూ మందకు వెళ్తున్నాడు.  ఆ క్రమంలో  రామ్ గత ఏడాది వారియర్ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'స్కంద' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా పాన్-ఇండియా ఇమేజ్‌ని, మార్కెట్‌ను ఏర్పరుచుకోవాలని భావిస్తున్నాడు. తన కెరియర్లో రామ్ చేస్తున్న ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా అన్ని పనులు పూర్తై రిలీజ్ కు రెడీ అయ్యింది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి.  అయితే అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ డల్ గానే ఉన్నాయి.మరో వారంలో రిలీజ్ ఉంది. ఎక్కడా సినిమా గురించి వినపడటం లేదు . కావాలనే సినిమాకు లో బజ్ ఉండేలా చేసి, ఎక్సపెక్టేషన్స్ లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యారా అనే డౌట్స్ అభిమానుల్లో వస్తున్నాయి. 

అయితే అదే సమయంలో ఈ సినిమా బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదనే వార్త ట్రేడ్ లో వినపడుతోంది. అందుకు కారణం రేట్లు ఎక్కువ చెప్పటమే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో రిస్క్ తీసుకోవటానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ఉత్సాహం చూపించటం లేదు. ఆంధ్రా(ఆరు ఏరియాలు)కలిపి 25 కోట్లు దాకా కొద్ది నెలల క్రితం కోట్ చేయటం జరిగిందట. అయితే డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఆసక్తి చూపక వెనక్కి జరిగారు. మరో ప్రక్క రిలీజ్ డేట్స్ ఛేంజ్ అవటం, డిలే లు తో అన్నీ మారాయి. వీటితో పాటు ఇలాంటి సినిమాకు కావాల్సిన స్దాయిలో ఆడియో వర్కవుట్ కాలేదు. ట్రైలర్స్ బాగున్నా రామ్ సినిమాలా అనిపించలేదు అని వినిపించింది.

వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు దిగి వచ్చి 25 కోట్ల నుంచి 22 కోట్లు కు రేటు తగ్గంచారట. అయినా సరే బయ్యర్లు పెద్దగా ముందుకు రాలేదు. రామ్ గత సినిమా భారీగా దెబ్బ తినటమే అందుకు కారణం అంటున్నారు. దాంతో 16 కోట్లు దాకా ఆఫర్ చేసారట. దాంతో నిర్మాత ..ఆ రేటు తమకు గిట్టుబాటు కాదని చెప్తున్నారట. ఆంధ్రా తరహాలోనే కొన్ని ఏరియాలు ఇలా బేరసారాలు జరుగుతున్నాయని వినికిడి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక #Skanda యుఎస్ రైట్స్  1.5 cr పలికాయని తెలుస్తోంది.  నార్త్ ఇండియా లో జీ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. 

అయితే ట్రైలర్ చూస్తూంటే హీరో రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాడు బోయ‌పాటి అని అర్దమవుతోంది. ఆడియన్స్  అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటుంద‌ని అర్థం అవుతోంది. బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్స్‌, రామ్ డైలాగ్‌లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.   శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ (Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు.  తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో ఈ సినిమా సెప్టెంబ‌ర్  28 న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో  హీరోయిన్ . శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.

Follow Us:
Download App:
  • android
  • ios