తమన్ ను పొగడ్తలతో ముంచెత్తిన రామ్ పోతినేని, కారణం ఏంటంటే..?

కోలీవుడ్ తో పాటు .. టాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నాడు తమన్. ముఖ్యంగా బాక్ గ్రౌండ్ స్కోర్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇక త్వరలో స్కంద మూవీతో రాబోతున్నాడు థమన్. ఈక్రమంలో తమన్ పై హీరో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

Ram Pothineni Praises Thaman For Skadha Music JMS

ప్రస్తుతంఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే ఇద్దరే ఇద్దరు గుర్తుకు వస్తున్నారు..అందులో ఒకరు అనిరుధ్ కాగా..మరొకరు థమన్. ఈ ఇద్దరు హీరోను బట్టి.. సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. బ్యాండ్ పగిలేలా ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తమన్ బాలయ్య లాంటి మాస్ హీరోకు ఊరమాస్ దరువేసి.. అఖండ సినిమా తో.. ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. అంతే కాదు తన మ్యూజిక్ తో ప్రతీ ఓక్కరిచేత స్టెప్పులేపించాడు తమన్. 

గత మూడేళ్లుగా టాలీవుడ్‌లో థమన్‌ హవా ఏ రేంజ్‌లో  చూస్తూనే ఉన్నాం. పాటలు సో సోగా అనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్‌ కొట్టడంలో తమన్‌కు మించినోరు లేరు. అఖండ అంత పెద్ద హిట్టవ్వడానికి మేయిన్‌ రీజన్‌ బాలయ్య ఎలివేషన్ సీన్స్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే కారణం. ఈరేంజ్ లో మ్యూజిక్ అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ సినిమాకు అనిరుథ్ ఇవ్వగా చూశాం.. ఇక ఆమధ్య అలవైకుంఠపురంలో ఈ రేంజ్‌ బ్లక్‌ బస్టర్‌ అవడానికి కారణం కూడా తమనే అనేది అందరికి తెలిసిన విషయం. అంతలా తన మ్యూజిక్‌తో థియేటర్‌లను ఊపేస్తాడు.

ఇలా సాగిపోతున్న తమన్.. ముచ్చటగా మూడోసారి బాలయ్య సినిమాను ఊపు ఊపేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా థమన్‌ సంగీతం అందించిన స్కంద రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి ఈసినిమాను డ్రైవ్ చేస్తున్నాడు. ఈనెలలో రిలీజ్ కాబోతోంది ఈమూవీ టీమ్.. ఇప్పటికే ప్రమోషన్‌లు జోరుగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా రామ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో తెగ సందడి చేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టదులతతో ఉన్నాడు రామ్.  

 ఈ క్రమంలో స్కంద మ్యూజిక్‌ గురించి మాట్లాడుతూ థమన్‌ను ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశాడు. స్కంద సినిమాకు థమన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ గూస్‌బంప్స్‌ అంతే. థమన్‌ మ్యూజిక్‌కు స్పీకర్స్‌ బ్లాస్ట్‌ అవడం పక్కా. థియేటర్‌ ఓనర్లు మళ్లీ కొత్తగా రెనోవేట్‌ చేసుకోవాల్సిందే అనే రేంజ్‌లో థమన్‌కు ఎలివేషన్‌ ఇచ్చాడు. మరి నిజంగానే థమన్‌ ఆ రేంజ్‌లో అవుట్‌ పుట్ ఇచ్చాడా అనేది చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios