సోషల్ మీడియాలో జనం ఎప్పుటికప్పుడు అప్ డేట్ గా ఉంటూంటారు. లేటెస్ట్ ఇష్యూల మీదే కాదు..సెలబ్రెటీల లుక్ ల మీద కూడా సరదా సరదా కామెంట్స్ పాస్ చేస్తూంటారు. అఫ్ కోర్స్ అవి సెలబ్రెటీల కూడా ఇష్టపడేవే. తమ గురించి , తమ లుక్ గురించి జనం ఏమనుకుంటున్నారో రోజులు తరబడి ఎదురుచూడకుండా క్షణాల్లో తెలిసిపోతూంటుందని వారు సంబరపడుతూంటారు.

తాజాగా హీరో రామ్ వదిలిన లేటెస్ట్ ఫొటో గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ లుక్ ని చూసిన జనం 'విరాట్ రామ్ కోహ్లి' అని పిలుస్తున్నారు. తన ఇనిస్ట్రగమ్ లో ఈ లేటెస్ట్ ఫొటో పోస్ట్ చేసారు రామ్. మరి ఈ ఫొటో చూసిన జనం విరాట్ కోహ్లితో ఎందుకు పోలుస్తున్నారో ...మీకు ఇప్పటికే అర్దమైపోయి ఉంటుంది.

ఇక రామ్ గత కొంతకాలంగా గమనిస్తే ఒకే లుక్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చిన్న చిన్న మార్పులు తప్ప లుక్ లో మార్పు తేవటం లేదు. అయితే తన తోటి మిగతా హీరోలు మాత్రం సినిమా సినిమాకూ లుక్ మార్చేస్తున్నారు. ఈ విషయం చాలా మంది సోషల్ మీడియాలో ఆయన అభిమానులు దృష్టికి తెస్తూనే ఉన్నారు. లుక్ మార్చన్నా..లక్ మారుతుంది అంటున్నారు. అయితే రామ్ స్పందించకుండా ఇలా హఠాత్తుగా ఈ ఫొటో వదిలి వారు పండగ చేసుకునేటట్లు చేసారు.

అయితే ఇది ఏదన్నా కొత్త సినిమా కోసం అనుకున్న లుక్కా, లేక సరదా కోసం చేసుకున్నదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  వెబ్ మీడియా మాత్రం...త్వరలో రామ్ చేయబోయే యాక్షన్ డ్రామా కోసం డిజైన్ చేసుకున్న లుక్ అంటోంది. అలాంటిది అయితే ఏ ఫస్ట్ లుక్ తోనే రివీల్ చేసి షాక్ ఇస్తాడు కదా..ఇలా ఎందుకు చేస్తాడు అనేది ఫ్యాన్స్ డౌట్. అయితే అసలు ఈ లుక్ జనాలకు నచ్చుతుందో లేదో తెలుసుకోవటానికి కావచ్చు కదా. 

హలో గురు ప్రేమ కోసమే సినిమా భాక్సాఫీస్ వద్ద కష్టం అనిపించాక రామ్ ..ఇప్పుడు కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. త్వరలో కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. లవ్ స్టోరీలు ప్రక్కన పెట్టి..యాక్షన్ తోనే రామ్ గెలుద్దామనుకుంటున్నట్లు టాక్. చూద్దాం..ఏం జరగనుందో...