ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమా పైన ఆసక్తిని పెంచేలా ఉంది. అంతా ఊహించినట్లుగానే ఈ చిత్రానికి “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
విడుదలైన గ్లింప్స్‌లో ఒక సూపర్ స్టార్ అభిమానిగా కథానాయకుడి జీవితం ఎలా ఉంటుందో, ఒక స్టార్ హీరో సినిమా విడుదలయ్యే సమయంలో ఫ్యాన్స్ ఎలాంటి ఉత్సాహాన్ని చూపిస్తారు, థియేటర్లలో ఎలాంటి కోలాహలం చోటుచేసుకుంటుందో విజువల్‌గా చూపించారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ సూర్య అనే స్టార్ హీరో వీరాభిమానిగా నటిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల సమయంలో టికెట్ల డిమాండ్ ఎలా పెరిగి, ఎగ్జిబిటర్లపై ఒత్తిడి ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఈ గ్లింప్స్‌లో చూపించడం గమనార్హం.
ఈ చిత్ర కథ అభిమానుల భక్తి భావాన్ని కేంద్రబిందువుగా తీసుకొని రూపొందించబడుతోంది. సినిమా ప్రేమికుల హృదయాలను తాకేలా ఈ స్టోరీ ఉంటుందని భావిస్తున్నారు. అభిమానుల గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉండబోతోంది.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర హీరో ఆంధ్రా కింగ్ సూర్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీతాన్ని ప్రతిభావంతులైన వివేక్ మెర్విన్ సంగీత దర్శకుల జోడీ అందిస్తున్నారు.
“ఆంధ్ర కింగ్ తాలూకా” సినిమా విడుదల తేదీని త్వరలోనే చిత్రబృందం ప్రకటించనుంది. రామ్ పోతినేని అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.