హీరోలు ఓ సారి తాను ఒకరిని నమ్మితే  హిట్ , ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ఆ డైరక్టర్స్ తో ముందుకు వెళ్లిపోతూంటారు. ముఖ్యంగా తమ ఆలోచనలు సింక్ అయ్యినప్పుడు మరీను. ఇప్పుడదే హీరో చేయబోతున్నట్లు సమాచారం. తనకు ‘ఉన్నది ఒకటే జిందగీ’తో ఫ్లాఫ్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో మరో సారి పనిచేయటానికి ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం. 

రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’తో  దర్శకుడిగా అందరి దృష్టిలో పడ్డారు కిషోర్‌ తిరుమల. అంతకు ముందు చేసిన సెకండ్ హ్యాండ్ చిత్రం ఎవరికి గుర్తు లేనంతగా ఆ సినిమా మరిపించింది. అప్పటికే వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రామ్ కు  ఆ చిత్రం మంచి సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి  కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’  చాలా ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైంది. అయితే సినిమాలో కంటెంట్ కనెక్ట్ కాకపోవటంతో భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. 

ఈ లోగా కిషోర్ తిరుమల...మెగా హీరో సాయి తేజ తో చిత్రలహరి అంటూ యావర్జే సినిమా చేసి  వచ్చారు. వరసగా ఆరు ప్లాప్ లతో ఉన్న సాయి తేజకు ఆ మాత్రం సినిమా ఆడటం కూడా గొప్ప విషయమే అయ్యింది. దాంతో కిషోర్ తిరుమలకు అది ప్లస్ అయ్యింది. దాంతో తన తదుపరి చిత్రానికి మళ్లీ హీరోగా రామ్ నే ఎంచుకున్నటట్లు సమాచారం. 

అయితే ఈసారి కిషోర్ తిరుమల కథ కాకుండా ఓ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కిషోర్ తిరుమల డైలాగులు కోసం అడిగి, డైరక్షన్ అప్పచెప్పినట్లు తెలుస్తోంది. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బిజీగా ఉన్నారు. జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాతే కొత్త సినిమా లాంచ్ అయ్యి, రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.