Asianet News TeluguAsianet News Telugu

The Warriiorr First look: పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రామ్ పోతినేని.. ఫస్ట్ లుక్ అదిరింది

హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ తొలిసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Ram Pothineni 19 title and first look is here
Author
Hyderabad, First Published Jan 17, 2022, 12:46 PM IST

హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ తొలిసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై రామ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి. రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 

దర్శకుడు లింగుస్వామి కమర్షియల్ అంశాలు మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలయింది. ఈ చిత్రానికి 'ది వారియర్' అనే టైటిల్ ఖరారు చేశారు. హీరో రామ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. ఖాకీ డ్రెస్ లో రామ్ పోతినేని స్టైలిష్ గా, కిల్లింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. 

రామ్ పోతినేని ఈ చిత్రంతో భారీ విజయంపై కన్నేశాడు. లింగుస్వామి కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో దిట్ట. అలాంటిది లింగుస్వామి రామ్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో ఊహించుకుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. 

విలన్ పాత్ర కోసం లింగుస్వామి ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకుని అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఆది పినిశెట్టి.. సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది ఫేమ్ నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios