Asianet News TeluguAsianet News Telugu

కరోనా కేసులు పెరిగాయి..అందుకే వాయిదా వేస్తున్నా

 ‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. ‘‘డీ కంపెనీ’ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలన్నింటికీ తల్లి లాంటిది. ఇది నా కలల ప్రాజెక్టు. ఒక వీధి ముఠాను భయంకరమైన అంతర్జాతీయ సంస్థగా దావూద్‌ ఎలా మార్చాడనేది ఈ చిత్ర కథ . ఈ చిత్రం  మార్చి 26న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు తాను విడుదల వాయిదా వేసుకుంటున్నట్లుగా వర్మ ప్రకటించారు. 

Ram Gopal Varmas D Company Gets Postponed jsp
Author
Hyderabad, First Published Mar 20, 2021, 4:24 PM IST

 ‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. ‘‘డీ కంపెనీ’ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలన్నింటికీ తల్లి లాంటిది. ఇది నా కలల ప్రాజెక్టు. ఒక వీధి ముఠాను భయంకరమైన అంతర్జాతీయ సంస్థగా దావూద్‌ ఎలా మార్చాడనేది ఈ చిత్ర కథ . ఈ చిత్రం  మార్చి 26న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు తాను విడుదల వాయిదా వేసుకుంటున్నట్లుగా వర్మ ప్రకటించారు. 

  కరోనా ప్రభావంతో తమ సినిమా విడుదల వేసుకున్నట్లుగా వర్మ ట్విట్టర్ లో  ప్రకటించాడు.   ఈ మూవీ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. కానీ దేశంలో కరోనా పరిస్థితిని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 

ఈ మేరకు.. “దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగిపోయింది. కొత్త లాక్‏డౌన్ పై వస్తున్న వార్తల మధ్య మేము డీ కంపెనీ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము” అంటూ ట్వీట్ చేశాడు. 

ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios