Asianet News TeluguAsianet News Telugu

వ్యూహం నుండి మరో ట్రైలర్... వాళ్లపై డైరెక్ట్ అటాక్!


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. అనేక అడ్డంకులు దాటుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నుండి మరో ట్రైలర్ విడుదల చేశారు. 
 

ram gopal varma vyooham all set to release here is new trailer ksr
Author
First Published Feb 14, 2024, 6:51 AM IST | Last Updated Feb 14, 2024, 6:51 AM IST

వ్యూహం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్. ఈ చిత్రం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. తెలంగాణ హైకోర్టు వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసింది. ఇక వ్యూహం చిత్ర విడుదల కష్టమే అనుకుంటుండగా... అన్ని అడ్డంకులను అధిగమించి విడుదలకు సిద్ధమైంది. వ్యూహం మూవీ ఫిబ్రవరి 23న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. 

వ్యూహం లేటెస్ట్ ట్రైలర్ ఊహించినట్లే కొందరు రాజకీయనాయకులను టార్గెట్ చేసేలా ఉంది. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ లను విలన్స్ గా చిత్రీకరించాడు. చంద్రబాబు పాము, మొసలి కంటే కూడా డేంజరస్ అని ఓ డైలాగ్ లో చెప్పించారు. ఇక సొంత నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేలా, ఓ సన్నివేశం ఉంది. 

నారా లోకేష్ కోసం టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. మొత్తంగా ఏపీ సీఎం జగన్ వారి కుట్రలను ఎదిరించి ప్రజలకు మంచి చేస్తున్న సీఎంగా ట్రైలర్ లో అభివర్ణించారు.  ఆర్జీవీ సీఎం జగన్ కి మైలేజ్ వచ్చేలా, అదే సమయంలో ఆయన పొలిటికల్ ప్రత్యర్థుల ఇమేజ్ దెబ్బతీసేలా వ్యూహం చిత్రీకరించారు. 

వ్యూహం ఫిబ్రవరి 23న, దాని సీక్వెల్ శబధం మార్చి 1న విడుదల కానున్నాయి. సీఎం జగన్ పాత్రను రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios