దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు, ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పలేం.. తన ట్విట్టర్ లో ఒక్కోసారి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటాడు. ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై పడ్డాడు. విషయమేమిటంటే.. తారక్ ని టీడీపీ పార్టీని ఆదుకోమని వర్మ చెప్పడం ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని ఆదుకునే ఏకైక శక్తి ఎన్టీఆర్ మాత్రమేనని, అర్జెంట్ గా సినిమాలు పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు వర్మ. ఎన్టీఆర్ గనుక టీడీపీని తన చేతుల్లోకి తీసుకుంటే ప్రజలంతా ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మర్చిపోతారని, ఎన్టీఆర్ మనవడు(జూనియర్ ఎన్టీఆర్) మాత్రమే ఆ పార్టీని కాపాడగలడని, తాతపై ఏమాత్రం గౌరవం ఉన్నా తారక్ వెంటనే టీడీపీని ఆదుకోవాలని అన్నారు.

గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నుండి, ప్రస్తుతం పార్టీని ముందు నుండి పొడిచిన కొడుకు(బాలకృష్ణ) నుండి టీడీపీని కాపాడాలని వర్మ అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు అల్లుడు చేసిన ద్రోహం కంటే ఇప్పుడు కొడుకు చేస్తున్న పని అతిపెద్ద ద్రోహం అంటున్నాడు వర్మ.

ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్, బాలయ్య, చంద్రబాబులను ఉద్దేశిస్తూ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  వీటితో పాటు ఓ పోల్ కూడా కండక్ట్ చేశాడు. తారక్ లీడర్ అయితే టీడీపీ పార్టీగొప్పగా తయారవుతుందా..? అని పోల్ నిర్వహించగా.. 79 శాతం మంది అవునని అన్నారు.