మరోసారి పొలిటికల్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లో హిట్ పెంచాడు రామ్ గోపాల్ వర్మ. జగన్ ను కలవడం.. అంతా అనుకునే లోప ట్విట్టర్ లో అసలు విషయం చెప్పేశాడు వర్మ. ఇక తాను తీయబోయే సినిమాకుసబంధించి ఫార్ములాను కూడా ప్రకటించాడు ఆర్జీవి.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... మరో సంచలనానికి తెర లేపబోతున్నాడు. ఈమధ్య కాస్త గ్యాప్ఇచ్చిన వర్మ.. మరోసారి రాజకీయాలపై సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకులని, పార్టీలని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు చేశాడు వర్మ.. ఎలక్షన్స్ తరువాత కాస్త కామ్ అయిన ఆర్జీవి.. రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ ని కలిసి ఏకాంతంగా దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. దాంతో మరో సినిమా రాబోతున్నట్టు అంతా అనుకున్నారు. 

జగన్ మీటింగ్ తరువాత రెండు సినిమాలు ప్రకటించాడు ఆర్జీవి. అవి అర్ధం చేసుకునే లోపు.. ఆ సినిమాల ఫార్ములాలను కూడా ప్రకటించాడు రాము. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఆడియన్స్ కు పెద్ద ఫజిల్ గా మారింది. ఆర్జీవీ.. BJP ÷ PK x CBN – LOKESH + JAGAN = వ్యూహం అంటూ ట్వీట్ చేశారు. అంటే తను తీయబోయే సినిమాలో అన్ని పార్టీల గురించి కచ్చితంగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆర్జీవీ చేసిన ట్వీట్ కి అర్ధం ఏంటో, ఆ పార్టీల లెక్కలకి మీనింగ్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇప్పుడు రాజకీయ వర్గాలన్నీ ఆ ట్వీట్ కి అర్ధం ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు. 

Scroll to load tweet…

జగన్ తో ఆర్జీవి మిటింగ్ అనగానే అటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ చర్చకు దారితీసింది. ఈ మీటింగ్ తర్వాత ఆర్జీవీ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించారు.ఈ రెండు సినిమాలు ఎవరి బయోపిక్ లు కాదు కానీ రియల్ పిక్ లు. రాజకీయాల మీదే ఉండబోతున్నాయి ఈ సినిమాలు. మొదటి సినిమా వ్యూహం చూసి ప్రేక్షకులు తేరుకునేలోపే రెండో సినిమా శపథం రిలీజ్ చేసి షాక్ ఇస్తాను అని చెప్పి ఆర్జీవీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

ఈ ప్రకటన చేయగానే అందరికి అర్ధం అయ్యింది... ఈ రెండు సినిమాలు జగన్ కి అనుకూలంగా ఏపీ రాజకీయాలపై ఉండబోతున్నాయని. దీనికోసమే ఆయన సీఎం జగన్ ను కలిశారని. గతంలో కూడా ఇలానే ఎలక్షన్స్ టైమ్ లో.. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు లాంటి సినిమాలతో రాజకీయంగా సంచలనం సృష్టించారు. ఈ సినిమాలతో జగన్ ను ఫేవర్ చేశారని విమర్షలు కూడా ఉన్నాయి. ఇక మరోసారి ఎలక్షన్స్ దగ్గర పడుతుండటం.. ఏపీలో పరిస్థితులు అప్పటిలా లేకపోవడంతో.. రాజకీయ వ్యూహంలో బాగంగానే ఈ మూవీస్ రాబోతున్నట్టు తెలుస్తోంది.