ఇది కదా అసలైన వెన్నుపోటు.. చంద్రబాబు పై రామ్ గోపాల్ వర్మ వెటకారం, వైరల్ అవుతున్న ట్వీట్..
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఛాన్స్ దొరికితే ప్రత్యర్ధులను వదిలిపెట్టడు. జగన్ కు సపోర్ట్ గా వ్యూహం సినిమాను కూడా తెరకెక్కిస్తున్న ఆర్జీవి.. పవన్ ను చంద్రబాబును టైమ్ దొరికినప్పుడల్లా.. ఏదో ఒక సెటైర్లు వేస్తూనే ఉంటాడు. తాజాగా చంద్రబాబుపై వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

వివాదాలతో ఆడుకోవడం సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా అలవాటు. తనకు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. ఓ ఆట ఆడుకోవాలి అని చూస్తాడు ఆర్జీవి. ఇక ఈమధ్య రాజకీయంగా చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు వర్మ. ఏ పార్టీలో చేరకపోయినా.. రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జగన్ ను సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు ఆర్జీవి.
తాజాగా చంద్రబాబు పై స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రమంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదోళన కారులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేయడంతో పాటు.. రాష్ట్రం అంతా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. దాంతో ఈ పరిస్తితులపై వర్మ తన మార్క్ కౌంటర్లతో విరుచుకుపడుతున్నాడు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఆర్జీవి ట్వీట్ చేశాడు. నిజమైన వెన్నుపోటు ఇదే అంటూ రాష్ట్రంలోని పరిస్థితులను ఉదాహరిస్తూ ట్వీట్ చేశారు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఏమని ట్వీట్ చేశారంటే..?
మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఓక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్ కి పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ , సినిమాలు చూసుకుంటూ, షాపింగ్లు చేసుకున్నారా ??? అవ్వ !!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా పవర్ స్టార్ పై కూడా సెటైరికల్ ట్వీట్ చేశాడు వర్మ.చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం అట్టుడికిపోతున్న క్రమంలో.. ఆయనకు మద్దతుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి బాబును పరామర్శించాలి అనుకున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ ను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కోపంతో ఊగిపోయిన జనసేనాని రోడ్డుపై పడుకుని, కూర్చుని నిరసన తెలిపారు. దాంతో పవర్ స్టార్ పై సెటైర్లు పేలుస్తూ.. ట్వీట్ చేశాడు వర్మ. తన పోస్టర్ ను పవన్ కాపీ కోట్టాడు అన్న మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేశాడు.
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ జగన్ సపోర్ట్ గా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాు. ఫ్యూహం టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా వైఎస్ జగన్ బయోపిక్ మూవీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో జగన్ పాదయాత్ర, సీఎం అవ్వడం. మధ్యలో ఏర్పడ్డ అడ్డంకులు ఇలాంటి విషయాలను టచ్ చేస్తూ ఆయన సినిమా చేస్తున్నారు. ఈసినిమాలో పవర్ స్టార్ తో పాటు చంద్రబాబు పై కూడా స్ట్రాంగ్ కౌంరట్లు ఈసినిమాలో వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్ వీడియోస్, స్పెషల్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి.