అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. `నిజంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్ అరియానా. ఆమెకి ఓట్ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు.
బోల్డ్ బ్యూటీ అరియానా రెండు మూడు సార్లు ఎలిమినేషన్‌లో చివరి వరకు వెళ్ళి సేవ్ అయ్యింది. గత వారం కూడా తన స్నేహితుడు అవినాష్‌తో జరిగిన పోటీలో అరియానా సేవ్ అయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో చాలా ఫైరింగ్‌తో గేమ్ ఆడుతుంది. బుధవారం ఎపిసోడ్‌లో సోహైల్‌కి దీటుగా రియాక్ట్ అయ్యింది. అతని తీరుపై మండిపడింది. తన గేమ్ తాడు ఆడుతున్నట్టు తెలిపింది. సోహైల్ బాగా ఫైర్ కావడంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన గేమ్ తాను ఆడటం కూడా తప్పా అంటూ బిగ్‌బాస్ ని ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. `నిజంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్ అరియానా. ఆమెకి ఓట్ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌కి వచ్చే ముందు అరియానా.. రామ్‌గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసింది. అది ట్రెండ్ అయ్యింది. అంతేకాదు ఇటీవల వర్మ స్పందిస్తూ, అరియానా బయటకు వచ్చాక ఆమెతో ఓ సినిమా తీస్తానని తెలిపిన విషయం తెలిసిందే. మరి ఈ వారం నామినేషన్‌లో ఉన్న అరియానా సేవ్ అవుతుందా? ఎలిమినేట్ అవుతుందా? అన్నది చూడాలి.
