మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ కూడా ఫిక్స్ చేశాడు వర్మ. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.


 గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకులని, పార్టీలని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని కలిసి ఏకాంతంగా దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ మీటింగ్ అటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చగా మారింది. ఈ మీటింగ్ తర్వాత ఆర్జీవీ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే వైయస్ జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. దాంతో ఇంతకీ వర్మ ..వ్యూహంలో ఏమి చూపెట్టబోతున్నారు..ఆ చిత్రం కథేంటన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. " నా కెరీర్ లో రాజకీయ సినిమాలు కేవలం సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే చేశాను. ఇప్పుడు వ్యూహం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కేవలం ఎలక్షన్స్ సమయంలోనే సేల్ అవుతాయి. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ అయిదేళ్ల వరకు పొలిటికల్ సినిమాలు తీయను. వ్యూహం సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వ్యూహం 2 సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది "అని తెలిపారు.

 వ్యూహం సినిమా కథ గురించి చెప్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ని తొక్కేయాలనుకున్నారు. కొందరు కుట్రలు చేశారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లోచూపిస్తాను. ఈ సినిమాకు మొదట కుట్ర అనే టైటిల్ అనుకున్నాను కానీ చీప్ గా ఉంటుందని తర్వాత వ్యూహంగా మార్చాను. వ్యూహం 2 లో జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన అంశాల గురించి, జగన్ పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది అని తెలిపారు ఆర్జీవీ. 

ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati) క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నది స్పష్టం చేసాడు వర్మ. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మూవీలో జగన్ పాత్ర చేసిన అజ్మల్ అమీర్ (Ajmal Ameer) ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్(manasa radhakrishnan) నటించబోతుంది. ఈ లుక్స్ చుసిన ఆడియన్స్.. పాత్రలకు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.