`హీరోలంతా భిక్షాటన చేసే గిన్నెతో వెళ్లి సీఎం జగన్‌ని దేవుడంటూ పొగిడారు. తద్వారా ఒమేగా స్టార్ మాత్రమే నిజమైన, పవర్‌ఫుల్ స్టార్ అని తమ అభిమానులకు నిరూపించుకున్నారు` అంటూ వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు.
వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) ఏపీ సీఎం జగన్‌పై, ఇటు చిరంజీవి(Chiranjeevi), ప్రభాస్(Prabhas), మహేష్(Mahesh), రాజమౌళి వంటి వారి ఇండస్ట్రీ పెద్దలపై విరుచుకుపడుతున్నాడు. వరుస ట్వీట్లతో షాకిస్తున్నారు. గతంలో ఏపీ మంత్రి పేర్నినానితో టికెట్ల రేట్ల ఇష్యూపై చర్చించిన అనంతరం సైతం ఇలా వరుస ట్వీట్లతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇప్పుడు మరోసారి రెచ్చిపోతుండటం హాట్ టాపిక్ అవుతుంది.
ఈ గురువారం(ఫిబ్రవరి 10)న ఏపీ సీఎం జగన్(CM Jagan)తో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని, అలీ, నిర్మాత నిరంజన్‌రెడ్డి చర్చలు జరిపారు. అందులో టికెట్ల రేట్ల గురించి సీఎంకి విన్నవించుకున్నారు స్టార్స్. అయితే ఓ తల్లిలా ఇండస్ట్రీ బాగోగులు ఆలోచించాలని, తమ కోర్కెలను తీర్చాలని చెబుతూ చిరంజీవి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం అనే వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బయటకు వచ్చి ఇప్పుడు దుమారం రేపుతుంది. చిరంజీవి స్థాయి వ్యక్తి దిగజారి ప్రవర్తించారని, తన స్థాయిని తగ్గించుకున్నారనే విమర్శలు, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి విషయాల్లో రెచ్చిపోయే రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు. సీఎంజగన్‌తో టాలీవుడ్ స్టార్స్ మీటింగ్‌కి సంబంధించి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. శుక్రవారం చేసిన ట్వీట్లలో సీఎం జగన్‌ని ఒమేగా స్టార్‌గా, టాలీవుడ్ స్టార్లని హీరోలు కాదు, జీరోలుగా అభివర్ణించారు. ఒమెగా స్టార్ ముందు చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి ఇలా అందరు జూ. ఆర్టిస్ట్ మాదిరిగా కూర్చున్నారని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేసిన వర్మ.. ఇప్పుడు శనివారం వరుస ట్వీట్లతో షాకిస్తున్నారు.
ఇందులో వర్మ చెబుతూ, `హీరోలంతా భిక్షాటన చేసే గిన్నెతో వెళ్లి సీఎం జగన్‌ని దేవుడంటూ పొగిడారు. తద్వారా ఒమేగా స్టార్ మాత్రమే నిజమైన, పవర్‌ఫుల్ స్టార్ అని తమ అభిమానులకు నిరూపించుకున్నారు. దేవుడు(జగన్) తన భక్తుల(టాలీవుడ్ స్టార్స్) కోరికను మంజూరు చేయడం కోసం కొన్ని రేట్లని పెంచడానికి కట్టుబడి ఉన్నాడు. కానీ ఆఖరికి ధరల పెరుగుదల మాత్రం అంతంత మాత్రమే అయినా, మన స్టార్స్ సైలెంట్‌గా ఉండిపోయారు. ఎందుకంటే వాళ్లు ఒమేగా స్టార్‌గా పట్టాభిషేకం చేశారు. కాబట్టి ఏం మాట్లాడలేరు.
ఒమేగాస్టార్ తన సొంత ఇండస్ట్రీ ప్రజలు కూడా పవర్ లెస్ స్టార్‌ని పట్టించుకోవడం లేదని, దీని ద్వారా సూపర్, మెగా, బాహుబలి, సర్కార్ మిక్స్ వేరియంట్ కంటే ఒమెగా వేరియంట్(సీఎం జగన్) తాను చాలా పవర్‌ఫుల్ అని నిరూపిస్తూ రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఇప్పుడు నేను ఒమేగా స్టార్‌కి పెద్ద అభిమానిగా మారిపోఆయను. ఎందుకంటే అతను చాలా సమర్థవంతంగా పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ తానే నిజమని గుర్తించేలా చేశాడు. ఇకపై ఒమేగా స్టార్‌ని ఒమేగా పవర్ అని పిలవాలనుకుంటున్నా` అంటూ ట్వీట్లు చేశారు వర్మ.
టాలీవుడ్ టాప్ స్టార్స్ వెళ్లి.. జగన్ ముందు చేతులు కట్టుకుని అడగడంతో వారి హీరోయిజం, ఇమేజ్ పోయాయని వర్మ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌స్టార్స్ కంటే సీఎం జగన్ గొప్ప అనే సంకేతాలను పంపారని వర్మ చెబుతున్నారు. అయితే అంతకు ముందు టికేట్ల రేట్ల విషయంలోనే వర్మ.. మంత్రి పేర్నినానితో ముచ్చటించారు. ఈ విషయంలో వర్మ చాలా యాక్టివ్‌గా, చాలా సీరియస్‌గా వ్యవహరించారు. తీరా చర్చల సమయంలో ఆయనకే పిలుపు లేకపోవడం గమనార్హం. ఓ రకంగా వర్మకిది అమమానమనే టాక్ వినిపిస్తుంది. ఈ అవమానం భరించలేకే వర్మ రగిలిపోతున్నాడని, ఆ బాధని ఇలా వరుస ట్వీట్లతో పంచకుంటున్నారని ఆయా హీరోల అభిమానులు కామెంట్లు చేయడం విశేషం. మరోవైపు టికెట్ల రేట్లు, ఇతర చిత్ర పరిశ్రమకి సంబంధించి ఈ నెల 17న మరోసారి చర్చలు జరుపబోతుంది ఏపీ ప్రభుత్వం.
