నచ్చింది తిని, కావాల్సినంత తాగి, ఇష్టం వచ్చినప్పుడు శృంగారం చేయాలన్నట్లుగా వర్మ మాట్లాడడం అక్కడున్న ప్రొఫెసర్లను ఇబ్బంది పెట్టింది.
డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఏమి తీసినా సెన్సేషన్. ఇప్పుడు ఏం మాట్లాడినా వివాదాస్పదం. ఆయన చేతుల్లో, మాటల్లో సొసైటి రెగ్యులర్ పద్దతులతు భిన్నంగా కనపడుతుంది. అవి అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవీ అంతే షాకింగ్, వివాదాస్పదంగా మాట్లాడారు. ఆ యూనిర్శిటీ నిర్వహించిన ‘అకడమిక్ ఎగ్జిబిషన్ 2023’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన అనంతరం ఆయన స్టూడెంట్స్‌తో ముచ్చటించారు.
బాగా చదువుకొని జీవితంలో ఎదగాల్సిన విద్యార్థులను కూడా తన లైఫ్ స్టయిల్ నే ఫాలో అవండి అని బోధించి అందర్నీ షాక్ కి గురిచేశారు ఆర్జీవీ. నచ్చిన విధంగా ఉండాలని విద్యార్థులకు వర్మ హితబోధ చేశారు. అక్కడితో ఆగలేదు వర్మ. నచ్చింది తిని, కావాల్సినంత తాగి, ఇష్టం వచ్చినప్పుడు శృంగారం చేయాలన్నట్లుగా వర్మ మాట్లాడడం అక్కడున్న ప్రొఫెసర్లను ఇబ్బంది పెట్టింది. అంతేకాకుండా తను తన కోసమే బ్రతుకుతానని, తను చనిపోయిన మరుక్షణం ఈ ప్రపంచం ఏమైనా తనకు అనవసరం అన్నారు. అలాగే తనకు పైన స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశిలపై నమ్మకం లేదని, అందుకే అన్ని వెతుక్కుంటానని చెప్పుకొచ్చారు. అలాగే తనను యూనివర్సిటీ వీసీ ఫిలాసఫర్ అనడంపై స్పందిస్తూ.. తాను పిచ్చినాకొడుకునని అన్నారు. దానికి డెఫినేషన్ కూడా చెప్పారు.
అలాగే ‘నా చిన్నప్పుడు చదువుకునేందుకు పెద్ద బాలశిక్ష ఇచ్చారు. ఈతరం పిల్లలు తమ సందేహాలు తీర్చుకునేందుకు చాట్ జీపీటీని ఉపయోగించుకోవాల్సి వస్తుంది’ అని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘చాట్ జీపీటీ గురించి మాట్లాడండి’ అంటూ ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందని ఓ విద్యార్థిని ఆయన్ను అడగ్గా సమాధానమిచ్చారు.
‘చాట్ జీపీటీని ఓ మనిషి అనుకోండి. మీకంటే తెలివైన స్నేహితుడుగా భావించండి. అతణ్ని (చాట్ జీపీటీ) మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలను గుర్తుచేశారు. ఫ్రొఫెషనల్ కోర్సులను మూడు/నాలుగేళ్లుపాటు ఎందుకు పెట్టారో తనకు అర్థంకాదన్నారు. ముందు వరుస బెంచ్‌పై కూర్చొనే విద్యార్థులు ఇంటిలిజెంట్ క్వశ్చన్స్ అడుగుతారని పేర్కొన్నారు. ‘మోక్షం’ గురించి వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్‌లు పెట్టిన ఆర్జీవీ.. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులను ‘నేను స్పాయిల్ చేయాలనుకున్నా కానీ వారే నన్ను స్పాయిల్ చేశారు’ అని పేర్కొన్నారు.
ఆ యూనివర్సిటీ నుంచి 37ఏళ్ల తర్వాత తన బీటెక్ సర్టిఫికెట్ తీసుకున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. తన సర్టిఫికెట్ ఫొటోను షేర్ చేశారు. ‘నా చిన్నప్పుడు చదువుకునేందుకు పెద్ద బాలశిక్ష ఇచ్చారు. ఈతరం పిల్లలు తమ సందేహాలు తీర్చుకునేందుకు చాట్ జీపీటీని ఉపయోగించుకోవాల్సి వస్తుంది’ అని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
