కన్నడ హీరో కిచ్చ సుదీప్, అజయ్ దేవగణ్ మధ్య జరుగుతున్నలాగ్వేజ్ ట్విట్ వార్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ టాపిక్ మధ్యలోకి రాజకీయాలు వచ్చాయి. ఇక ఈ ఇద్దరి మధ్యలో అసలైన వాడు దిగాడు. ప్రతీ విషయంలో తనదైనస్టైల్లో స్పందించే రామ్ గోపాల్ వర్మ. ఈ ఇష్యూగురించి సంచలన ట్వీట్ చేశారు. 

కన్నడ హీరో కిచ్చ సుదీప్, అజయ్ దేవగణ్ మధ్య జరుగుతున్నలాగ్వేజ్ ట్విట్ వార్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ టాపిక్ మధ్యలోకి రాజకీయాలు వచ్చాయి. ఇక ఈ ఇద్దరి మధ్యలో అసలైన వాడు దిగాడు. ప్రతీ విషయంలో తనదైనస్టైల్లో స్పందించే రామ్ గోపాల్ వర్మ. ఈ ఇష్యూగురించి సంచలన ట్వీట్ చేశారు. 
 హిందీ జాతీయ భాష అనే అంశం పే ఇద్దరు స్టార్ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసుకుంటూ.. వరుస ట్వీట్ లు చేసుకున్నారు హీరోలు. ఇక తాజాగా ఈ గొడవ మధ్యలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరిపోయారు. ఆయన సీన్ లోకి ఎంటర్ అయితే మామూలుగా ఉండదు కదా..? ఏదో ఒక స్టాండ్ తీసుకుని అవతలి వారిని ఏకి పడేస్తాడు. లేదా తన మార్క్ సెటైలర్లతో చెమటలు పట్టిస్తాడు. ఇప్పుడు కూడా ఇదే పని చేశాడు వర్మ. 

Scroll to load tweet…

 బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు. హిందీలో దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ బాగా పెరిగిపోతోందని అన్నారు. దక్షిణాది..ఉత్తరాది కాదని, భారతదేశం మొత్తం ఒక్కటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ట్వీట్ చేశారు.అంతే కాదు ప్రాంతీయత గురించి ఓ చిన్న లెక్చర్ కూడా ఇచ్చారు వర్మ. 

ప్రాంతీయత అనేది అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రకరకాల భాషలు డెవలప్ అయ్యాయని, ఇక్కడ అందరూ తెలుసుకోవల్సిన విషయం ఏంటీ అంటే.. భాష ప్రజలు దగ్గరయ్యేందుకు ఉపయోగపడాలి కానీ.. విడదీసేందుకు కాదు అని క్లాస్ పీకారు రామ్ గోపాల్ వర్మ.

Scroll to load tweet…

అంతే కాదు సౌత్ సినిమాలపై స్పందిస్తూ కూడా రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. కేజీఎఫ్ 2 50 కోట్ల ఓపెనింగ్ సాధించడంతో బాలీవుడ్ స్టార్స్..సౌత్ స్టార్స్ పై అసూయతో ఉన్నారు అన్నది ఎవరూ కాదనలేని నిజం. ఇకపై బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయో చూద్దాం. బాలీవుడ్ లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది రన్ వే 34 కలెక్షన్లు చెప్పేస్తాయి అని వర్మ ఘాటుగా ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఇంతకీ ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే.. ఓ ఈవెంట్ లో సుధీప్ కెజియఫ్ మూవీ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా సౌత్ సినిమాలు ఉంటున్నాయని, హిందీ ఇక జాతీయ భాష కాదని ఓ ఫంక్షన్ లో సుదీప్ అన్నాడు. అంతేకాదు.. హిందీ వాళ్లే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, తమిళం, తెలుగు, కన్నడలో సినిమాలను డబ్ చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ దేవగణ్ మండిపడ్డారు. హిందీ జాతీయ భాష కానప్పుడు.. దక్షిణాది సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు.ఈ వివాదం రకరకాల మలుపులు తీసుకుంటూ.. రాజకీయ రంగులు పులుముకుంటోంది.