ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్‌ ఎవరూ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో టాప్‌ చైర్‌కు చేరువయ్యాడు జక్కన్న . ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ను కూడా అదే స్థాయిలో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోసారి రాజమౌళి చరిత్ర సృష్టించటం ఖాయం అని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

అయితే ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా రాజమౌళికి జేజేలు పలుకుతున్నా.. ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ్లాప్‌ కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ ఫ్లాప్‌ అయితే అందరూ రోడ్ల మీదకు వచ్చి బట్టలు విప్పేసి షాంపైన్‌ బాటిల్స్‌తో డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అలా ఎందుకు చేస్తారో కూడా వివరించాడు ఆర్జీవీ. `ప్రతీ ఒక్కరికి కుళ్లు ఉంటుంది. ఆ కుళ్లు కారణంగానే మనిషి మరొకరి సక్సెస్‌ను తట్టుకోలేడు. అది మానవ సహజం. ఒకరి ఎదుగుదలను ఎవరూ జీర్ణించుకోలేరు. రాజమౌళి ఆ రేంజ్‌లో సక్సెస్‌ అయితే మనం చచ్చిపోవటం మేలు అని ఫీలవుతారు` అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇది కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ ఒకరు మరొకరిని చూసి ఇలాగే ఫీలవుతారని చెప్పాడు ఆర్జీవీ.