దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించడంతో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించడంతో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో దేనిని వదిలిపెట్టరు. తన కామెంట్స్ తో అందరి అటెన్షన్ పొందుతారు. తాజాగా వర్మ తన సినిమా కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాడేస్తున్నాడు. 

వర్మ తెరకెక్కించిన 'డేంజరస్' చిత్రం ఏప్రిల్ 8న రిలీజ్ కు రెడీ అవుతోంది. అడల్ట్ కంటెంట్ తో, శృంగార భరిత సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నైనా గంగూలీ, అప్సర ప్రధాన పాత్రల్లో నటించారు. లెస్బియన్ తరహాలో ఈ చిత్రం ఉండబోతోంది. 

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో వర్మ తన డేంజరస్ గర్ల్స్ తో కలసి ప్రమోషన్స్ షురూ చేశాడు. అందరిలా ప్రమోషన్స్ చేస్తే ఆయన రాంగోపాల్ వర్మ ఎందుకవుతారు. తన సినిమా కోసం వర్మ ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఉపయోగించుకున్నారు. ట్విట్టర్ లో రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళిపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాజమౌళి సర్ మీ దగ్గర రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ మెన్ ఉన్నారు. కానీ నాదగ్గర నైనా గంగూలీ, అప్సర లాంటి డేంజరస్ విమెన్ ఉన్నారు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇది వర్మ మార్క్ ప్రమోషన్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…