Asianet News TeluguAsianet News Telugu

ఆ నటులు రీల్ ఫిల్మ్ స్టార్స్.. కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్: రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా వర్మ ఓ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma Says KCR is REAL PAN INDIA POLITICAL STAR
Author
First Published Sep 27, 2022, 2:37 PM IST

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలు, రాజకీయాలు అనే తేడా  లేకుండా ఏ విషయంలోనైనా తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తాజాగా టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా వర్మ ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ తర్వలోనే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. 

ఈ క్రమంలోనే స్పందించి వర్మ.. సినిమా నటుల్లా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ట్వీట్ చేశారు. ‘‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగుజాడలను అనుసరించి.. టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా పాన్ ఇండియాగా వెళ్తుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యాష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ లాగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్’’ అని వర్మ పేర్కొన్నారు. శుభకాంక్షలు చెబుతున్నట్టుగా ఓ ఫ్లవర్ ఎమోజీని కూడా ట్వీట్‌లో ఉంచారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 

 

 

ఇక, జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఆయన దసరాకు (అక్టోబర్ 5వ తేదీన) పార్టీ ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దసరా రోజున పార్టీ ప్రకటన ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ కొత్త పార్టీ అధికారికంగా ప్రారంభించబడుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. 

కొత్త పార్టీ మేనిఫెస్టో తయారీలో జాప్యం, నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక అంశాలపై విధానాలను చక్కదిద్దడం, నిపుణుల బృందాలతో పార్టీ జెండాను రూపొందించడం వంటివి.. పార్టీ ప్రకటన వాయిదాకు కారణాలుగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. వివిధ రంగాల్లోని నిపుణులతో బ్యాక్‌ గ్రౌండ్ వర్క్, సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. అలాగే కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్.. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, రైతులను కలుస్తున్నారని తెలిపాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios