పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా కెమెరా ముందుకు రాని పవన్‌, ఇటీవల తన పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తరువాత రోజు నితిన్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు పవన్‌. అయితే ఈ సమయంలో పవన్‌ లుక్‌పై వర్మ సెటైర్‌లు వేశాడు. ప్రస్తుతం వర్మ, పవన్‌ల మధ్య సైలెంట్ వార్ కొనసాగుతోంది.

వర్మ పవర్‌ స్టార్ పేరుతో పవన్ జీవితం మీద సెటైరికల్‌ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా వర్మ ఆఫీస్‌ మీద దాడికి కూడా పాల్పడ్డారు జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు. దీంతో వర్మ మాటల దాడిని మరింతగా పెంచాడు. ఈ సమయంలో పవన్ న్యూ లుక్‌ వర్మకు అస్త్రంగా మారింది. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల్లో పవన్‌ ఓ స్వామిజీలా కనిపించటంతో వర్మ సెటైర్లు వేశాడు.

నితిన్‌ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవన్‌ ఫోటోలను షేర్‌ చేసిన వర్మ వరుస కామెంట్లు చేశాడు. `బాబు బాబా అయ్యాడా..?, మీ ఆశీర్వాదం కావాలి` అంటూ కామెంట్ చేశాడు వర్మ. అంతేకాదు పవన్‌ ఇంటర్వ్యూకు కేవలం 1 లక్ష వ్యూస్‌ మాత్రమే వచ్చాయని, తన పవర్‌ స్టార్‌ ట్రైలర్‌కు 24 లక్షల వ్యూస్‌ వచ్చాయంటూ సెటైర్‌లు వేశాడు వర్మ. ఇక వర్మ తెరకెక్కించిన పవర్‌ స్టార్‌ సినిమా ఈ రోజు 11 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.