పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి సంబంధించిన ఈ విషయాన్ని వదలడు రామ్ గోపాల్ వర్మ. మరి భీమ్లా నాయక్ ట్రైలర్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుండగా... గుట్టుగా ఎందుకుంటాడు. తన మార్కు సెటైర్స్ తో విరుచుకుపడ్డాడు.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా పడింది. ఈ వార్త పవన్ ఫ్యాన్స్ ని పూర్తి నిరాశకు గురిచేసింది. ఈవెంట్ రద్దైనా... ట్రైలర్ విడుదల చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యంగా భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేశారు. భీమ్లా నాయక్ ట్రైలర్ పై మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. ట్రైలర్ లోని కొన్ని లోపాలు ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా బీజీఎం సరిగా లేదు. 

తమన్ అంటేనే బీజీఎం అలాంటిది... భీమ్లా నాయక్ ట్రైలర్(Bheemla Nayak trailer) బీజీమ్ పూర్తిగా నిరాశకు గురిచేసింది. ఇక ట్రైలర్ లో లెక్కకు మించిన పంచ్ డైలాగ్స్ ఎక్ప్పెక్ట్ చేసిన వారికి ఆ కోణంలో అసంతృప్తి ఎదురైంది. మొత్తంగా భీమ్లా నాయక్ ట్రైలర్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదనేది మాత్రం నిజం. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని పట్టుబట్టిన రామ్ గోపాల్ వర్మ కొన్ని లోపాలు వెతికాడు. 

నాటకీయంగా చూసినా వాస్తవికంగా చూసినా భీమ్లా నాయక్ ట్రైలర్ పై నా అభిప్రాయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే రానా దగ్గుబాటి పూర్తి సినిమా.. అంటూ ట్వీట్ చేశారు. పవన్ కోసం అసలు కథకు అనేక మసాలా అంశాలు జోడించి తెరకెక్కిస్తే వర్మ మాత్రం భీమ్లా నాయక్ లో విషయం అంతా రానా దగ్గుబాటి పాత్రలోనే ఉందని తేల్చేశారు. 

మరో ట్వీట్ లో భీమ్లా నాయక్ హిందీ వర్షన్ గురించి మరొక కామెంట్ చేశాడు.. బాహుబలి సినిమా కారణంగా పవన్ కంటే కూడా రానా దగ్గుబాటినే హిందీ ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి వాళ్ళు భీమ్లా నాయక్ సినిమాలో రానా(Rana Daggubati) హీరో , పవన్ విలన్ అని పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కి అత్యంత సన్నిహితులైన నిర్మాతలు ఈ విషయంలో ఎలా నిర్లక్ష్యంగా ఉన్నారు, అని సెటైర్ వేశాడు. భీమ్లా నాయక్ మూవీలో పవన్ ప్రత్యర్థిగా రానాని కాకుండా మరొక హీరోని తీసుకోవాల్సిందని వర్మ ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. 

Scroll to load tweet…

వర్మ (Ramgopal Varma)తన చివరి ట్వీట్ లో ఫ్యాన్స్ ని మరింత ఆగ్రహానికి గురిచేశారు. ఆయన జస్ట్ ''Bhee'' అని ట్వీట్ చేశారు. BheeMLA టైటిల్ లోని భీమ్లా నుండి MLA తొలగించి ఆయన ఆ ట్వీట్ చేశారు. సదరు పదానికి పూర్వాపరాలు ఏమీ పెట్టకున్నా నెటిజెన్స్ దీనిపై డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం తిట్టిపోస్తున్నారు. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల సందర్భంగా మరోసారి పవన్ ఫ్యాన్స్ ని గెలికారు. పరోక్షంగా ఆయన భీమ్లా నాయక్ ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

Scroll to load tweet…