వర్మ చాలా కాలం తరువాత హార్ట్ ఫుల్ గా ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ని, ప్రధాన పాత్ర చేసిన నటుడు మనోజ్ బాజ్ పాయ్ ని పొగిడారు. వర్మ తన ట్వీట్ ద్వారా ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై ప్రశంసలు కురిపించారు.  

రామ్ గోపాల్ వర్మ ఎవరినీ పొగిడే రకం కాదు. చాలా అరుదుగా ఆయన సినిమాలను, నటులను పొగుడుతారు. ఒక్కోసారి పొగిడినట్లుగా విమర్శించడం, ఎగతాళి చేయడం చేస్తూ ఉంటాడు. అలాంటి వర్మ చాలా కాలం తరువాత హార్ట్ ఫుల్ గా ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ని, ప్రధాన పాత్ర చేసిన నటుడు మనోజ్ బాజ్ పాయ్ ని పొగిడారు. వర్మ తన ట్వీట్ ద్వారా ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై ప్రశంసలు కురిపించారు. 


ఒక రియలిస్టిక్‌ జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీ దూసుకుపోవడానికి ఫ్యామిలీమ్యాన్‌ 2 మంచి అవకాశం ఇచ్చిందన్న వర్మ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిసి ఉందని, ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడు తన నటనతో అద్భుతంగా మలిచాడంటూ మనోజ్‌ వాజ్‌ పాయ్ అంటూ ఆకాశానికి ఎత్తాడు. 


మరోవైపు తమిళ నేతలు, ప్రజలు తమను అవమానించేలా ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ఉందని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం నిలిపివేయాలని కోరుకుంటున్నారు. తమిళ దర్శకుడు నటుడు భారతీరాజా ఈ సిరీస్ పై ఫైర్ అయ్యారు. ప్రసారం నిలిపి వేయకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని అమెజాన్ ప్రైమ్ ని హెచ్చరించారు. అలాగే మరో నటుడు మనో బాల సమంత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

Scroll to load tweet…