సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కారణంగా సినిమా విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తి కావడంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. గతంలో కోర్టు.. పోలింగ్ పూర్తయిన తరువాత సినిమాను విడుదల చేయొచ్చని ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు దీనికి ఎలెక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పడంతో వర్మ ఫైర్ అవుతున్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఈసీ లేఖను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ.. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
అంతేకాదు.. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడంపై దీని వెనుక ఉన్న శక్తులెవరో అందరికీ తెలుసునంటూ ట్వీట్ చేశారు.
