సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంటాడు. గతంలో ఇండియన్‌ సినిమా గర్వించే ఎన్నో సినిమాలను తెరకెక్కించిన వర్మ ఇటీవల తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే సక్సెస్‌లు సాధించలేకపోయినా తన సినిమాలకు కావాల్సినంత ప్రమోషన్‌ సాధించటంలో మాత్రం వర్మ ఫెయిల్ కావటం లేదు. రాజకీయ పరిణామాల నుంచి సామాజిక సంఘటనల వరకు ప్రతీ అంశాన్ని తనదైన స్టైల్‌లో వాడేసుకుంటున్నాడు వర్మ.

తాజాగా ఈ సంచలన దర్శకుడు కరోనా ని కూడా కబాడీ ఆడుకుంటున్నాడు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో ముందుగా ఇది ఒక పురుగు అంటూ తానే స్వయంగా రాసి పాడిన ఓ పాటను రిలీజ్ చేశాడు. తరువాత దేవుడికి కరోనాకు డ్యూయెట్‌ అంటూ మరో పాటను రిలీజ్ చేశాడు. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా అందరూ తమ సినిమా పనులు ఆపేసుకుంటే వర్మ మాత్రం సైలెంట్‌ ఓ సినిమా తీసేశాడు. అది కూడా పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవాతో కావటం విశేషం.

గతంలో మియాతో జీ ఎస్‌ టీ (గాడ్ సెక్స్‌ అండ్‌ ట్రూత్) అనే సినిమాను తెరకెక్కించాడు వర్మ. కేవలం న్యూడ్‌గా మియా అందాలను చూపిస్తూ రూపొందించిన ఈ మూవీ అప్పట్లో ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇప్పుడు అదే నటితో మరో సినిమాను రూపొందించాడు వర్మ. `క్లైమాక్స్‌ పేరుతో రూపొందిన ఆ సినిమా టీజర్‌ను గురువారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆర్‌ఎస్‌ ఆర్‌ ప్రొడక్షన్స్‌, శ్రేయాస్‌ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించాడు వర్మ.