Asianet News TeluguAsianet News Telugu

వర్మ కొత్త సినిమా: `అల్లు` అంటూ గిల్లుతున్నాడు!

ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బామ్మర్ది ఏం చేశాడ‌నేది ఈ సినిమాలో చూపిస్తామ‌ని చెప్పారు.  అంతేకాదు 'జ‌న రాజ్యం' పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లు అవుతుంద‌ని మ‌రో బాంబు పేల్చారు. ఈ సినిమాకు అల్లు అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామ‌న్నారు. 

Ram Gopal Varma next film titled Allu
Author
Hyderabad, First Published Aug 2, 2020, 1:22 PM IST

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో చిత్రం టైటిల్ ని ప్రకటించి సంచలనం రేపారు."అల్లు" అనే టైటిల్ తో  ఫిక్ష‌న‌ల్ సినిమాను తెరకెక్కిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్రకటించారు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బామ్మర్ది ఏం చేశాడ‌నేది ఈ సినిమాలో చూపిస్తామ‌ని చెప్పారు.  అంతేకాదు 'జ‌న రాజ్యం' పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లు అవుతుంద‌ని మ‌రో బాంబు పేల్చారు. ఈ సినిమాకు అల్లు అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామ‌న్నారు. 

‘త‌న‌కు మంచి జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు, మ‌రొక‌డికి చెడు జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు.. అనే స్ట్రాట‌జీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన త‌న బావ ప‌క్క‌నే ఉంటూ త‌న మైలేజీ ప‌డిపోకుండా ఉండ‌టానికి త‌మ ఇంటి అల్లుడును కూడా మ‌ర్చిపోయి ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు. అంద‌రితో త‌న‌ను 'ఆహా' అనిపించుకోడానికి త‌న‌కు కావాల్సిన వాళ్ల‌కే మంచి జ‌రిగేలా చెప్పి, ప్లాన్‌ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లిక‌ల మాస్ట‌ర్ క‌థే ఈ అల్లు’ అని చెప్పుకొచ్చారు. 

ఈ సినిమాలోని పాత్ర‌ల పేర్ల‌‌ను కూడా వెల్ల‌డించారు. ఈ సినిమాలో ఎ.అర‌వింద్‌, కె.చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్.‌బాబు త‌దిత‌రులు ఉంటార‌ని తెలిపారు. దాంతో ఈ చిత్రం ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గురించి తీస్తున్న‌ట్లు ఈ పాటికే అర్థ‌మైందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే త‌న‌కు ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, త‌న‌ను నికృష్టుడు అని పిలిచిన అల్లు అర‌వింద్‌పై ప్ర‌తీకారం కాద‌ని వర్మ స్ప‌ష్టం చేశారు.

అప్పట్లో  రెండేళ్ల క్రితం శ్రీరెడ్డి చేప‌ట్టిన కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను లాగ‌మ‌ని చెప్పింది తానేన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. దీంతో అల్లు అర‌వింద్ ఆర్జీవీని నికృష్టుడు, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios