తెలుగులో మరో ఓటీటీ రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు సరికొత్తగా వస్తుంది. వినోదాల విందుని అందించి ఉర్నూతలూగించేందుకు `ఊర్వశి ఓటీటీ` అనే కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ నెలాఖరు వరకు `ఇనాగురల్‌ ఆఫర్‌`గా ఉచిత వినోదం పంచబోతుంది `ఊర్వశి ఓటీటీ`. ఈ ఫర్‌లో భాగంగా షకలక శంకర్‌, ఆర్లిన్‌, డి.ఎస్‌.రావు, మధురిమ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన `రామ్‌ లోపాల్‌‌ వర్మ` లఘు చిత్రం విడుదల కానుంది. దీనికి ప్రముఖ దర్శకుడు వీరు కె దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ, `ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న `ఊర్వశి ఓటీటీ` ఇనాగురల్‌ ఆఫర్‌గా మా `రామ్‌ లోపాల్‌ వర్మ` షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్‌ కావడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిన దర్శకుడు.. ఇప్పుడు అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకెళ్తుండటాన్ని జీర్ణించుకోలేక, సదరు దర్శకుడిపై ఇప్పటికీ ఉన్న గౌరవంతో, ఆవేదనతో, ఆయన లోపాలను ఎత్తిచూపుతూ, ఆయనకు పూర్వ వైభవాన్ని కోరుకుంటూ ఈ షార్ట్ ఫిల్మ్ నిరూపొందించాను. వినోదానికి పెద్ద పీట వేస్తూ, విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన `రామ్‌ లోపాల్‌ వర్మ` లఘు చిత్ర అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంద`ని తెలిపారు. 

ఇది చాలా హాట్‌గా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. లక్కీ, ఫిష్‌ వెంకట్‌, శశికాంత్‌, హర్షద పటేల్‌ ఇతర పా్రతలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: గోపి కాకాని, ఎడిటింగ్: అల్లియో, డాన్స్: రామారావు, ఫైట్స్: కృష్ణ, రచన-నిర్మాణం-దర్శకత్వం: వీరు.కె.