సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ సినిమా విడుదలయ్యే వరకు అనుమానమే. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

కానీ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చెప్పిన సమయానికి విడుదల చేస్తామని అంటున్నారు. బుధవారం నాడు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. వారి నుండి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే.. ఆ సన్నివేశాలు తొలగించి సర్దుబాటు చేయడానికి ఒక్కరోజు సమయమే ఉంటుంది. 

ఈ లెక్కన చూసుకుంటే సినిమా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా వర్మ.. ఎన్టీఆర్ పాపులర్ ఫోటోని మార్ఫింగ్ చేసి తన ఫోటో పెట్టుకున్నాడు. ఇది ఆయన అభిమానులు పంపారో లేక ఆయనే చేసుకున్నారో కానీ ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ''ఎన్టీఆర్ లుక్ ఒకరిని పోలినట్టు ఉంది.. అతనెవరో తెలుసా..?'' అంటూ ఈ మార్ఫింగ్ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఎన్టీఆర్ తో వర్మని పోల్చుకోవడంతో సోషల్ మీడియాలో కామెంట్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. మా కర్మ అంటూ ఎన్టీఆర్ అభిమానులు తల పట్టుకుంటున్నారు.