Asianet News TeluguAsianet News Telugu

వర్మ కొత్త ఆఫీస్ 'డెన్' (వీడియో) చూసారా? బూతు బొమ్మలు ఎక్కువే

 సైకిల్ చైన్, మధ్యలో గన్ ఉండేలా ఆఫీసు ముందు భాగాన్ని డిజైన్ చేశారు. అలాగే లోపల అమ్మాయిల నగ్నత్వం తో కూడిన ఫొటోలు ఎక్కువగానే ఉన్నాయి.  

Ram Gopal Varma hyderabad new office Den Tour
Author
First Published Jun 10, 2023, 2:02 PM IST


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అందులో తనదైన ముద్ర, తనదైన ఆలోచనలు ఉండేలా చూసుకుంటారు. తన అభిరుచికి తగ్గట్లే ప్రతీదాన్ని ఎంచుకుంటారు. తాజాగా తన ఆఫీస్ ఎలా ఉంటుందో తన అభిమానులకు చూపాలనుకున్నారు. ఆర్జీవీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న డెన్ కేవలం సినిమా ఆఫీసుగా వాడటం కోసం మాత్రమే . అయితేనేం చాలా ఖర్చు పెట్టి డిజైన్ చేసారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.  మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తన గతం గుర్తు చేసుకుంటూ ఈ వీడియో సాగుతుంది. సైకిల్ చైన్, మధ్యలో గన్ ఉండేలా ఆఫీసు ముందు భాగాన్ని డిజైన్ చేశారు. అలాగే లోపల అమ్మాయిల నగ్నత్వం తో కూడిన ఫొటోలు ఎక్కువగానే ఉన్నాయి.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

ఇక సినిమాల విషయాలకు వస్తే.. రామ్‌ గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అది కూడా రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అందులో మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్‌ కూడా ఖరారు చేశాడు వర్మ. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్‌ ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. 

ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్‌, వైఎస్‌ భారతి క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తున్నది స్పష్టం చేశాడు వర్మ. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో జగన్‌ పాత్ర చేసిన అజ్మల్‌ అమీర్‌ ఈ సినిమాలో కూడా జగన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక వైఎస్‌ భారతి పాత్రలో మానస రాధా కృషన్‌ నటించబోతున్నారు. ఈ లుక్స్‌ చుసిన ఆడియన్స్‌… పాత్రలకు వీరు సరిగ్గా సరిపోయారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వ్యూహం షూటింగ్‌ మొదలు పెట్టేసిన వర్మ… ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios