ఎప్పటికప్పుడు కరెంట్ టాపిక్స్ పై సినిమాలు చేసి క్యాష్ చేసుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన 'కరోనా వైరస్'.. విజృంభిస్తున్న వేళ.. మొదట అది ఒక పురుగు అంటూ ఓ పాట వదిలారు. ఇప్పుడు అదే టాపిక్ పై ఓ సినిమా చేస్తున్నారు.  దేవుడు  కరోనా వైరస్ తో కలిసి ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నారని వివాదాస్పద కామెంట్లు ట్విట్టర్ లో పోస్టు చేసిన ఆయన ఇప్పుడు అదే విషయమై సినిమా తీసి రిలీజ్ కు రెడీ చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఈ విషయమై వర్మ ట్వీట్ చేస్తూ...‘‘కరోనా వైరస్ పేరిట ఫీచర్ ఫిల్మ్ చేశాను. ఈ సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లో షూట్ చేశాం. ఇది కరోనా వైరస్ సబ్జెక్ట్ మీద తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా కానుంది. మా నటీనటులు, ఇతర సిబ్బంది తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లో ఉన్నా వాళ్లు మాత్రం లాక్డ్ డౌన్ కాలేదు. 26న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో ఇప్పటికే వర్మ ఒక షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ‘క్లైమాక్స్’ పేరుతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో పోర్న్ స్టార్ మిమా మాల్కోవా ప్రధాన పాత్ర పోషించింది. ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ ఈ షార్ట్ ఫిల్మ్‌ను కూడా విడుదల చేశారు. శ్రేయాస్ ఈటీ సమర్పణలో ఈ ఫిల్మ్‌ను నిర్మించారు. ఇప్పుడు ‘కరోనా వైరస్’ సినిమాను కూడా శ్రేయాస్ ఈటీ సమర్పిస్తోంది.  ఈ చిత్రాన్ని డిజిటల్‌లోనే విడుదల చేసే అవకాశం ఉంది.