వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిన్నటివరకు మెగాఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన వర్మ ఇప్పుడు పవన్ పై పాజిటివ్ కామెంట్స్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది.

పవన్ నిజాయితీని, పవర్ ని గుర్తు చేసుకుంటూ తన ట్విట్టర్ లో.. 'సీబిఎన్.. పీకేని గత ఎన్నికల్లో అలవాటు ప్రకారం వెన్నుపోటు పోడిచినందుకు రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన  నైజములో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబుని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత  మెగా నమ్మకం'' అంటూ రాసుకొచ్చాడు. 

ఈ పోస్ట్ పెట్టిన మరికొద్దిసేపటికి మరో పోస్ట్ పెట్టాడు. అందులో బ్రహ్మం గారు.. పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం అవుతాడని, లేకపోతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడని చెప్పినట్లు వర్మ వెల్లడించాడు. వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.