వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిసారి ఎదో ఒక కాంట్రవర్సీ తో ట్వీట్ చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఎప్పుడైనా ఆయన పాజిటివ్ వే లో కామెంట్ చేశారో అదొక ఊహించని అద్భుతమని చెప్పాలి. ఇక ఏమైందో ఏమో గాని వర్మ సైరా సినిమాపై మొదటిసారి స్పందించాడు.

అది కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.  టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీగా సైరా నరసింహారెడ్డి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

అయితే సినిమాకు సంబందించిన రెండవ ట్రైలర్ ని రిలీజ్ చేయగా వర్మ కుదోస్ అంటూ మెగాస్టార్ ని ఒక రేంజ్ లో పొగిడారు.  మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ట్రైలర్ అద్భుతంగా ఉందని ఫాదర్ అండ్ ఆడియెన్స్ కి నిర్మాత రామ్ చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారని అన్నారు. అందుకు రామ్ చరణ్ కి ధన్యవాదాలు అని ఆర్జీవీ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.