ఁవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా వినియెగించుకుంటూ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి లాక్‌డౌన్‌ను గడిపేస్తున్న సమయాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. ఓ ఫామ్ హౌస్ లో తన టీమ్ ని పెట్టి వరస సినిమాలు చేస్తున్నారు. రిలీజ్ లు చేస్తున్నారు.  ఈ క్రమంలో  'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా తీస్తానని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ..వర్మపై మండిపడుతున్నారు.

ఆ సందర్భంగా రామ్ గోపాల్‌ వర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కల్యాణ్‌లా ఉండడం, పవర్‌ స్టార్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేగాక,  ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌ ఉంటారని ఆయన చెప్పారు. ఆ పదాలకు అర్థం చెబుతూ మెగాస్టార్‌, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అనే ఇప్పటికే అందరూ గుర్తించారు. అయితే, ఇది పవన్ కల్యాణ్ బయోపిక్ కాదని వర్మ వివరణ ఇచ్చారు.

'నేను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ టాప్‌ సినీ స్టార్.. అనంతర పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుద్దికుంటోంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే' అని చెప్పారు. పవర్ స్టార్‌ అనే సినిమా పవన్ కల్యాణ్‌ బయోపిక్‌ అంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలు బాధ్యతారాహితం, వాటిల్లో నిజాలు లేవని ఆయన ట్వీట్లు చేశారు.