Asianet News TeluguAsianet News Telugu

`యానిమల్‌` మూవీపై ఆర్జీవీ బోల్డ్ రివ్యూ.. ఆ ఇద్దరి కాళ్లు నాకుతా అంటూ సంచలన స్టేట్‌మెంట్‌..

రామ్‌గోపాల్‌ వర్మ.. యానిమల్‌ సినిమాపై తనదైన రివ్యూ ఇచ్చారు. నాలుగు పేజీల రివ్యూని రాసుకొచ్చాడు. అంతేకాదు బూట్లు నాకుతా అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

ram gopal varma bold review on animal movie and gave bold statement arj
Author
First Published Dec 3, 2023, 8:25 PM IST

`యానిమల్‌` సినిమా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తుంది. రెండు రోజుల్లోనే ఇది రెండు వందల ముప్పై కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. రణ్‌ బీర్‌ కపూర్‌ నట విశ్వరూపం, రష్మిక నటన, సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్‌, బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. అంతేకాదు సందీప్‌ బోల్డ్ గా కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. దీన్నొక పిచ్చి సినిమాగా చెబుతున్నా, ఆడియెన్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. యూత్‌, మాస్‌ ఆడియెన్స్ కి పిచ్చెక్కించేలా ఉందని చెప్పొచ్చు. 

ఇక తాజాగా ఈ సినిమాపై రామ్‌గోపాల్‌ వర్మ రివ్యూ ఇచ్చారు. ఆయన ఏ సినిమాకి లేనంతగా సుధీర్ఘమైన రివ్యూ ఇచ్చారు. ప్రతి సీన్‌ని, ప్రతి అంశాన్ని చర్చిస్తూ, దాన్ని వివరిస్తూ ఆయన రివ్యూ రాయడం విశేషం. తన ట్విట్టర్‌ ద్వారా వర్మ ఈ పోస్ట్ పెట్టారు. ఇందులో ప్రధానంగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్‌ గురించి, ఆయన కథని రాసిన తీరు గురించి మాట్లాడారు. సినిమా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయడం మాత్రమే కాదు, ఇంపాక్ట్ క్రియేట్‌ చేయాలి, అది చర్చించుకునేలా చేయాలి. అలా సందీప్‌ రెడ్డి వంగా `యానిమల్‌` సినిమాతో నిరూపించాడని, వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడని తెలిపారు. 

బాక్సాఫీసు కలెక్షన్లు పూర్తయ్యాక కూడా కొన్ని సంవత్సరాల పాట ఈ సినిమా గురించి చర్చిస్తారని, తర్కాలు కొనసాగుతాయన్నారు. `ఈ సినిమా హిపోక్రిసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపం తో చూపించడం తో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది  అని నా ప్రఘాడ  నమ్మకం. ఎందుకంటే `యానిమల్` అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంటు` అని రాసుకొచ్చాడు వర్మ. 

రష్మిక మందన్నా.. రణ్‌బీర్‌ని పట్టుకుని ఇతర అమ్మాయితో సెక్స్ లో పాల్గొనేటప్పుడు కండోమ్‌ వాడావా అని కోపపడే సన్నివేశానికి వర్మ ఫిదా అయిపోయాడట. రణ్‌బీర్‌ కపూర్‌  నటనలో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన  `రాజా హరిశ్చంద్ర ` నుంచి ఇప్పుడు 2023 వరకూ, నూట పది సంవత్సరాలలో ఏ యాక్టర్‌ చూపించలేకపోయాడని, ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రన్బీర్ లియోనార్డో డి కాప్రియో ని కూడా మించిపోయాడని ప్రశంసలు కురిపించారు వర్మ. 

`నేను ముందే చెప్పినట్టు, ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణ్‌ బీర్‌తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా , అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను` అని బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు వర్మ. 


ఇక నుంచి బాలీవుడ్ లో  కానీ, టాలీవుడ్  లో  కానీ, ప్రతి సినిమా ఆఫీసుల్లోనూ `యానిమల్` సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే  ప్రతి సినిమాని  పీడిస్తుందన్నారు ఆర్జీవీ. ఇక చివరగా ఆయన చెబుతూ ఈ సినిమా చూశాక తనకు ఒక్క స్పష్టంగా అర్థమయ్యిందని, సందీప్‌కి, ఇతర దర్శకులకు ఉన్న తేడా స్పష్టంగా తెలిసిందని, ఇతర దర్శకులు అంతా.. ఆడియెన్స్ తమకంటే తక్కువగా ఉంటారనే ఆలోచనలో ఉన్నారని నమ్ముతారని, కానీ సందీప్‌ ఆడియెన్స్ అంతా తనలాగే ఉన్నారని నమ్ముతాడని చెప్పడం విశేషం. 

ఇక వర్మ పూర్తి రివ్యూని ఆయన ట్విట్‌లో చూడొచ్చు...
 

Follow Us:
Download App:
  • android
  • ios